calender_icon.png 18 March, 2025 | 8:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల సహకారంతోనే పట్టణాభివృద్ధి

17-03-2025 02:08:33 AM

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ 

జగిత్యాల, మార్చి 16 (విజయక్రాంతి): అన్ని వర్గాల ప్రజల సంపూర్ణ సహకారం ఉంటేనే పట్టణం అభివృద్ధి చెందుతుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్’కుమార్ పేర్కొన్నారు.

జగిత్యాల జిల్లా మోతే గ్రామ గోవింద్’పల్లిలో ఈజీఎస్ నిధులు రూ. 35 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్’కుమార్ ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ అభివృద్దికి ప్రజలందరి భాగస్వామ్యంతో పాటూ సహకారం అవసరమన్నారు.

ప్రజలు ప్రభుత్వ నియమాలకు లోబడి లెఔట్ ప్రకారం కొత్త నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. పట్టణంలో 14 జోన్లలో  121 సర్వే నంబర్లు  మార్పుతో ఇప్పుడు చట్టబద్ద అనుమతులు వస్తున్నాయన్నారు.గోవింద్’పల్లి వాగుపై  వంతెన నిర్మాణం కోసం రూ. 4.5 కోట్ల నిధుల మంజూరుకై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందని ఎమ్మెల్యే వివరించారు. ప్రస్తుతం రూ .2 కోట్లతో మోతే చెరువు పునరుద్ధరణకు నిధులు మంజూరయ్యాయని పేర్కొన్నారు. 

సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

జగిత్యాల అర్బన్, మార్చి 16 (విజయక్రాంతి): జగిత్యాల నియోజకవర్గానికి చెందిన 102 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ. 28 లక్షల 25 వేల చెక్కులను పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్’కుమార్ ఆదివారం అందజేశారు.

ప్రజలు టీకాలు వేసుకోవడం ద్వారా రోగాలు నివారించవచ్చని హితవు పలికారు. జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో 320 పడకల ఆసుపత్రి మంజూరైందని, త్వరలో పనులు ప్రారంభం కానున్నాయన్నారు.జగిత్యాల నియోజకవర్గానికి రాష్ట్రంలోనే అత్యధిక పల్లె దవాఖానాలు మంజూరయ్యాయని, లింగంపెట్ పల్లె దవాఖానను త్వరలోనే ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమాలలో మాజీ మున్సిపల్ చైర్మన్లు అడువాల జ్యోతి లక్ష్మణ్, గిరి నాగభూషణం, గోలి శ్రీనివాస్, మాజీ ఏఎంసీ చైర్మన్ దామోదర్’రావు, నాయకులు రమేష్, చెరుకు జాన్ తదితరులు పాల్గొన్నారు.