ఉత్తర్వులిచ్చిన పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్
హైదరాబాద్, అక్టోబర్ 28 (విజయక్రాంతి): రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఒక మున్సిపాలిటీ, 107 గ్రామాలను కలిపి ఆదిలాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీగా ఏర్పాటు చేశారు.
జోగులాంబ గద్వాల జిల్లాలోని 4 మున్సిపాలిటీలు, 194 గ్రామాలను కలిపి జోగులాంబ గద్వాల అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీగా, కొమ్రంభీంలోని 2 మున్సిపాలిటీలు, 199 గ్రామాలను కలిపి కాగజ్‌నగర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీగా, కామారెడ్డి జిల్లాలోని 3 మున్సిపాలిటీలు, 460 గ్రామాలను కలిపి కామారెడ్డి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 2 మున్సిపాలిటీలు, ఒక గ్రామాన్ని కలిపి కొత్తగూడెం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీగా, మహబూబాబాద్ జిల్లాలోని 4 మున్సిపాలిటీలు, 159 గ్రామాలను కలిపి మహబూబాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీగా, మహబూబ్‌నగర్ జిల్లాలోని 153 గ్రామాలను కలిపి మహబూబ్‌నగర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీగా, మంచిర్యాల జిల్లాలోని 6 మున్సిపాలిటీలు, 350 గ్రామాలను కలిపి మంచిర్యాల అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీగా, నాగర్‌కర్నూల్ జిల్లాలోని 4 మున్సిపాలిటీలు, 319 గ్రామాలను కలిపి నాగర్‌కర్నూల్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీగా, నిర్మల్ జిల్లాలోని 3 మున్సిపాలిటీలు, 420 గ్రామాలను కలిపి నిర్మల్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీగా, నిజామాబాద్ జిల్లాలోని 3 మున్సిపాలిటీలు, 380 గ్రామాలను కలిపి నిజామాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీగా, కరీంనగర్ జిల్లాలోని 3 మున్సిపాలిటీలు, 147 గ్రామాలను కలిపి శాతవాహన అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీగా, సిద్దిపేట జిల్లాలోని 4 మున్సిపాలిటీలు, 286 గ్రామాలను కలిపి సిద్దిపేట అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీగా, ఖమ్మం జిల్లాలోని 2 మున్సిపాలిటీలు, 279 గ్రామాలను కలిపి స్థంభాద్రి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీగా, సూర్యాపేట జిల్లాలోని 5 మున్సిపాలిటీలు, 264 గ్రామాలను కలిపి సూర్యాపేట అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీగా, వికారాబాద్ జిల్లాలోని 4 మున్సిపాలిటీలు, 492 గ్రామాలను కలిపి వికారాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీగా, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఓ మున్సిపాలిటీ, 152 గ్రామాలను కలిపి వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీగా, వనపర్తి జిల్లాలోని 5 మున్సిపాలిటీలు, 215 గ్రామాలను కలిపి వనపర్తి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీగా, జనగామ జిల్లాలోని ఒక మున్సిపాలిటీ, 133 గ్రామాలను కలిపి జనగామ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీగా, నారాయణ్‌పేట జిల్లాలోని 3 మున్సిపాలిటీలు, 245 గ్రామాలను కలిపి నారాయణ్‌పేట అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీగా, జగిత్యాల జిల్లాలోని 5 మున్సిపాలిటీలు, 294 గ్రామాలను కలిపి జగిత్యాల అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీగా, మెదక్ జిల్లాలోని 2 మున్సిపాలిటీలు, 289 గ్రామాలను కలిపి మెదక్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీగా, యాదాద్రి భువనగిరి జిల్లాలోని 2 మున్సిపాలిటీలు, 144 గ్రామాలను కలిపి యాదాద్రి భువనగిరి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీగా, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఓ మున్సిపాలిటీ, 221 గ్రామాలను కలిపి జయశంకర్ భూపాలపల్లి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీగా, సంగారెడ్డి జిల్లాలోని 4 మున్సిపాలిటీలు, 466 గ్రామాలను కలిపి సంగారెడ్డి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీగా, నల్గొండ జిల్లాలోని 7 మున్సిపాలిటీలు, 502 గ్రామాలను కలిపి నీలగిరి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీగా ఏర్పాటు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఆయా జిల్లాల్లో ఏర్పాటు చేసే అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలకు సంబంధిత జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా, జిల్లాకు సంబంధించిన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వైస్ చైర్మన్‌గా వ్యవహరించడంతోపాటు ముగ్గురు సభ్యులు ఉండనున్నారని వెల్లడించారు.