calender_icon.png 11 April, 2025 | 1:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఊరచెరువు మాయం !

13-12-2024 12:27:02 AM

*అంబారిపేట్‌లో కబ్జాకు గురైన చెరువు

* పట్టించుకోని అధికారులు

కామారెడ్డి, డిసెంబర్ 12 (విజయక్రాంతి): జిల్లాలోని దోమకొండ మండలం అం బారిపేట్  పరిధిలో 35 ఎకరాల ఆయకట్టు కలిగిన ఊర చెరువు కనిపించకుండా పోయింది. మూడెకరాల విస్తీర్ణంలో ఉన్న ఊరచెరువు కబ్జాకు గురైంది. ఏళ్ల తరబడి కబ్జాదారులు కూలగొట్టి దున్ని పంటలుసాగు చేస్తుంటే రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు అటువైపు వెళ్లిన దాఖలాలు లేవు. బీఆర్‌ఎస్ 10 హయాంలో అధికార పార్టీ నేతలు గ్రామాల్లో కుంటలు, చెరువులను కబ్జా చేశారు.అందుకు నిదర్శనమే అంబారిపేట్ ఊర చెరువు.

ప్రభుత్వ భూములను రక్షించాల్సిన అధికారులు, కబ్జాదారులకు అండగా ఉండటం వల్లే ఇలా జరిగిందని ఆ ఊరి యువకులు అంటున్నారు. రూ.లక్షల విలువైన భూ ములను కబ్జా చేస్తుంటే సామాన్యులు ప్రశ్నించలేకపోతున్నారని వారు తెలిపారు. కబ్జాకు గురైన ఊరచెరువును వినియోగంలోకి తీసుకొస్తే పశువులకు నీటి వసతి.. 35 ఎకరాలకు సాగునీరు అందుతుందని రైతులు అభిప్రాయపడుతున్నారు. అధికారులు చొరవ తీసుకొని కబ్జాకు గురైన భూమిని స్వాధీనం చేసుకొని వినియోగంలోకి తీసుకురావాలని గ్రామస్తులు కోరుతున్నారు.