calender_icon.png 7 January, 2025 | 8:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూడో రోజూ అప్‌ట్రెండ్

04-12-2024 12:00:00 AM

  1. అంతర్జాతీయ సానుకూల సంకేతాల ప్రభావం
  2. సెన్సెక్స్ 600 పాయింట్లు, నిఫ్టీ 180 పాయింట్లు జంప్

ముంబై, డిసెంబర్ 3: దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా మూడో ట్రేడింగ్ సెషన్లోనూ ముందుకు కదిలింది. హెవీవెయిట్ షేర్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్,  రిలయన్స్ ఇండస్ట్రీస్ అండతో  బీఎస్‌ఈ సెన్సెక్స్ 697 పాయింట్లు పెరిగి 80, 845 పాయింట్ల వద్ద నిలిచింది. ఇదేబాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మరో 181 పాయింట్లు పెరిగి 24,457 పా యింట్ల వద్ద ముగిసింది.

గ్లోబల్ పాజిటివ్ సెంటిమెంట్‌తో ప్రధాన సూచీలు ర్యాలీ సాగించాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు.  బలహీన ఆర్థిక గణాంకాలు ఇప్పటికే కార్పొరేట్ ఫలితాల్లో ప్రతిబింబించినందున, భవిష్యత్ వృద్ధి అవకాశాలపై ఇప్పుడు ఇన్వెస్టర్లు దృష్టి సారించారని నాయర్ వివరిం చారు.

ఆసియా మార్కెట్లలో సియోల్, టోక్యో, షాంఘై, హాంకాంగ్‌లు పెరిగాయి. యూరప్ సూచీలు గ్రీన్‌లో ముగిసాయి. యూఎస్ ప్రధాన ఇండెక్స్‌లైన డోజోన్స్ ఇండస్ట్రియల్ ఏవరేజ్, నాస్‌డాక్, ఎస్ అండ్ పీన500లు ఆల్‌టైమ్ రికార్డుస్థాయి వద్ద ట్రేడవుతున్నాయి. 

అదానీ గ్రూప్ షేర్ల ర్యాలీ

అదానీ గ్రూప్‌నకు చెందిన మెజారిటీ కంపెనీలు షేర్లు ర్యాలీ చేశాయి. సెన్సెక్స్, నిఫ్టీ సూచీల్లో భాగమైన అదానీ పోర్ట్స్ 6 శాతం పెరిగింది. అంబూజా సిమెంట్స్ 5.15 శాతం, ఏసీసీ 2.56 శాతం, అదానీ ఎంటర్‌ప్రైజెస్ 2.33 శాతం, సంఘి ఇండస్ట్రీస్ 2.09 శాతం, అదానీ విల్మార్ 1.19 శాతం, ఎన్డీటీవీ 0.50 శాతం చొప్పున లాభపడ్డాయి.

అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ పవర్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ స్వల్పంగా తగ్గాయి. యూఎస్ హెడ్జ్ ఫండ్ హిండెన్‌బర్గ్ అదానీ గ్రూప్‌పై తీవ్ర ఆరోపణలతో కూడిన రిపోర్ట్ విడుదల చేసినప్పటికంటే ఇప్పుడ ఆ గ్రూప్ ఆర్థికంగా పటిష్ఠస్థాయిలో ఉన్నదంటూ అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ బెర్న్‌స్టెయిన్ తా జా నివేదిక తెలపడంతో అదానీ కంపెనీల షేర్లు పెరిగాయి. అదానీ గ్రూప్ నకు ప్రస్తుతం షేర్ల తనఖాలేవీ లేవని, రుణ భారం తగ్గిందని, ఇబిటా పెరుగుతున్నదని బెర్న్‌స్టెయిన్ వివరించింది. 

కొనుగోళ్లు జరిపిన ఎఫ్‌పీఐలు

వరుస విక్రయాలకు పాల్పడుతున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) మంగళవారం మాత్రం కొనుగోళ్లు జరిపారు.  వి దేశీ ఇన్వెస్టర్లు రూ. 3,664 కోట్ల నిధుల్ని మార్కెట్‌లో పెట్టుబడి చేసినట్లు స్టాక్ ఎ క్సేంజీల తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. విదేశీ ఫండ్స్ గత మూడు ట్రేడింగ్ సెషన్లలో రూ. 16,000 కోట్ల వరకూ ఈక్విటీల నుంచి వెనక్కు తీసుకున్నారు. 

జీఎస్టీ కమిటీ సిఫార్సుతో క్షీణించిన ఐటీసీ, వరుణ్ బేవరేజెస్

పొగాకు, శీతల పానీయాలపై వస్తు సేవల పన్నును (జీఎస్టీ) ప్రస్తుత 28 శాతం నుంచి 35 శాతానికి పెంచాయంటూ జీఎస్టీ రేట్ల హేతుబద్దీకరణ మంత్రుల కమిటీ సిఫార్సు చేయడంతో సిగరెట్ల కంపెనీలు ఐటీసీ, గాడ్‌ఫ్రే ఫిలిప్స్, శీతల పానీయాల తయారీ సంస్థ వరుణ్ బేవరేజెస్ షేర్లు క్షీణించాయి.

ట్రేడింగ్ తొలిదశలో 3 శాతంపైగా తగ్గిన ఐటీసీ చివరకు 1.02 శాతం నష్టంతో 472.30 వద్ద ముగిసింది. వీఎస్టీ ఇండస్ట్రీస్ షేరు 2.27 శాతం క్షీణతతో రూ.318 వద్ద నిలిచింది. వరుణ్ బేవరేజెస్ 1.86 శాతం, గాడ్‌ఫ్రే ఫిలిప్స్ 1.71 శాతం చొప్పున తగ్గాయి. 

అదానీ పోర్ట్స్ టాప్ గెయినర్

సెన్సెక్స్ బాస్కెట్‌లో అన్నింటికంటే అధికంగా అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ షేరు 6 శాతం జంప్ చేసింది. ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, లార్సన్ అండ్ టుబ్రో, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్,  టైటాన్, టాటా మోటార్స్ 2.5 శాతం వరకూ పెరిగాయి. మరోవైపు భారతి ఎయిర్‌టెల్, ఐటీసీ, సన్‌ఫార్మా, ఏషియన్ పెయింట్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్‌లు నష్టాలతో ముగిసాయి.

వివిధ రంగాల సూచీల్లో సర్వీసెస్ ఇండెక్స్ 2.13 శాతం, యుటిలిటీస్ ఇండెక్స్ 1.41 శాతం, ఇండస్ట్రియల్స్ ఇండెక్స్ 1.36 శాతం, క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ 1.23 శాతం, పవర్ ఇండెక్స్ 1.20 శాతం, కమోడిటీస్ ఇండెక్స్ 1.16 శాతం చొప్పున పెరిగాయి. టెలికమ్యూనికేషన్స్, ఎఫ్‌ఎంసీజీ సూచీలు తగ్గాయి. బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 1.03 శాతం, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.92 శాతం చొప్పున లాభపడ్డాయి.