calender_icon.png 30 October, 2024 | 10:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వచ్చే ఏడాది ఏప్రిల్‌లోనే ఎప్‌సెట్?

30-10-2024 02:23:54 AM

  1. ఉన్నత విద్యా మండలి కసరత్తు
  2. ప్రైవేటు అధ్యాపకులకు శిక్షణ ఇచ్చేందుకు ప్లాన్

హైదరాబాద్, అక్టోబర్ 29 (విజయక్రాంతి): 2024 మేలో నిర్వహించిన ఎప్ సెట్ ఇంజినీరింగ్, ఫార్మసీ అడ్మిషన్ల ప్రక్రి య కొన్ని కాలేజీల్లో ఇంకా కొనసాగుతోంది. ప్రవేశ పరీక్ష నిర్వహించి దాదాపు ఐదు నెలలవుతున్నా ఇంకా అడ్మిషన్ల ప్రక్రియ కొన సాగుతుంది.

దీంతో అకాడమిక్ క్యాలెండర్ ఆలస్యంగా ప్రారంభంమై తరగతులు కూడా ఆలస్యంగా మొదలవుతున్నాయి. ఈక్రమంల్లో పరీక్షల నిర్వహణ ఆలస్యమై ఫలితా లూ ఆలస్యంగానే వెలువడుతాయి. దీంతో విద్యార్థులు పైచదువులకు వెళ్లాలంటే ఇబ్బంది పడే అవకాశం ఉంది. చాలా రాష్ట్రాలు, దేశాల్లో అకాడమిక్ ఇయర్ సరైనా సమయంలో ప్రారంభమవుతుంది.

అలాంటప్పుడు మన విద్యార్థులు అక్కడికి వెళ్లి చదువుకోవాలంటే అప్పటికే అడ్మిషన్లు పూర్తయ్యే అవకాశం ఉంది. దీనిపై దృష్టి సారించిన తెలంగాణ ఉన్నత విద్యామండలి వచ్చే ఏడాది ఓ నెల రోజులు ముందే ఎప్‌సెట్‌ను ప్రారంభించాలని భావిస్తోంది. ఈ ఏడాది మే నెలలో ఎప్‌సెట్‌ను నిర్వహించారు.

ఇప్పటికీ బీ-కేటగిరీ అడ్మిషన్లను కొన్ని కాలేజీలు చేపడుతున్నాయి. ఇలా నెలల తరబడి అడ్మిషన్ల ప్రక్రియ జరగడం సరైంది కాదనే భావనలో ఉన్నత విద్యామండలి ఉంది. 2025 విద్యాసంవత్సరాన్ని నెల రోజులు ముందుకు జరిపి ఏప్రిల్‌లో ఎప్‌సెట్‌ను నిర్వహించాలని యోచిస్తోంది. 

‘స్పాట్’ పెట్టేస్తున్నారు..

2024-25 విద్యా సంవత్సరానికి ఎప్‌సెట్ నోటిఫికేషన్‌ను ఫిబ్రవరిలో జారీ చేసి, ఏప్రిల్ 6 వరకు దరఖాస్తులు స్వీకరించారు. రూ.250 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 9వ తేదీ వరకు, రూ.500 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 14 వరకు, రూ.2500 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 19 వరకు, రూ.5వేల ఆలస్య రుసుముతో మే 4వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులకు అవకాశం కల్పించారు.

పరీక్షలను మే 9-12 మధ్య నిర్వహించారు. అనంతరం ఇంజినీరింగ్ అడ్మిషన్లను సెప్టెంబర్ వరకు చేపట్టారు. కొన్ని ప్రైవేట్ కాలేజీలు ప్రస్తుత విద్యాసంవత్సరానికి ఇంకా స్పాట్ అడ్మిషన్లను తీసుకుంటున్నాయి. ఇంజినీరింగ్ సీట్ల కన్వర్షన్, పెంపు, బ్రాంచీల విలీనానికి సంబం ధించి ప్రభుత్వం అనుమతినివ్వకపోవడంతో కొన్ని కాలేజీలు హైకోర్టు, సుప్రీం కోర్టులను ఆశ్రయించాయి.

ప్రస్తుతం సదరు కాలేజీలే స్పాట్ అడ్మిషన్లను చేపడుతున్నాయి. ఈ కేసు ఇంకా కోర్టు పరిధిలో ఉండగానే కొన్ని కాలేజీలు అడ్మిషన్లు చేపడుతున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. కోర్టును ఆశ్రయించి న 13 ప్రైవేట్ కాలేజీల్లో 5 వేల వరకు సీట్లుం టే, అందులో 3,700 సీట్లను స్పాట్ అడ్మిషన్లతో భర్తీ చేసినట్లు ఓ అధికారి తెలిపారు. 

ప్రైవేట్ కాలేజీల్లోని అధ్యాపకులకు శిక్షణ..

ప్రైవేట్ కాలేజీల్లో బోధించే అధ్యాపకులకు శిక్షణ ఇవ్వాలని ఉన్నత విద్యామండలి భావిస్తోంది. అర్హతలు, విద్యా ప్రమాణాలను కాలేజీలు పాటించడంలేదు. మారుతున్న కాలానికనుగుణంగా అధ్యాపకులూ అప్‌డే ట్ కావాల్సి ఉంది. వినూత్న విద్యాబోధన పద్ధతుల ద్వారా విద్యనందించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఆయా కాలేజీల మేనేజ్‌మెంట్లతో మాట్లాడి అందులో పనిచేసే అధ్యాపకులకు శిక్షణ ఇచ్చేందుకు విద్యామండలి కసరత్తు చేస్తోంది.