న్యూఢిల్లీ, జనవరి 22: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ బుధవారం వెలువడింది. అఖిల భారత సర్వీసుల్లో దాదాపు 979 పోస్టుల భర్తీకి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్(సీఎస్‌ఈ) పరీక్ష ద్వారా భర్తీ చేయనున్నారు. ప్రిలిమ్స్ పరీక్షను మే 25న నిర్వహించనున్నట్లు యూపీఎస్సీ అధికారులు తెలిపారు.
బుధవారం నుంచే దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. ఫిబ్రవరి 11వరకు దరఖాస్తుల ప్రక్రియకు తుదిగడువుగా నిర్ణయించారు. గతేడాది భర్తీ చేసిన 1056 పోస్టులతో పోల్చకుంటే ఈసారి 77 పోస్టులు తక్కువగా ఉన్నాయి.
సివిల్స్ ప్రిలిమ్స్, మెయిన్స్, ఇం టర్వ్యూ అనే మూడు దశల్లో జరుగుతుంది. ప్రిలిమ్స్‌లో కటాఫ్ మార్కులు దాటినవారు మెయిన్స్‌కు ఎంపికవుతారు. మరిన్ని వివరా లు అధికారిక వెబ్‌సైట్ https://upsc .gov.in/ ద్వారా తెలుసుకోవచ్చు.