calender_icon.png 1 November, 2024 | 6:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనీ రాజీనామా

21-07-2024 01:21:20 AM

నెల ముందే రాష్ట్రపతికి రాజీనామా లేఖను సమర్పించిన మనోజ్

ఇంకా 5 సంవత్సరాల సర్వీస్ ఉండగానే రాజీనామా

న్యూఢిల్లీ, జూలై 20: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మనోజ్ సోని తన పదవికి రాజీనామా చేశారు. నెల రోజుల ముందే ఆయన తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి సమర్పించారని అధికారులు పే ర్కొంటున్నారు. గత ఏడాది మేలోనే బాధ్యతలు చేపట్టిన మనోజ్ ఇంకా ఐదు సంవ త్సరాల పదవీకాలం మిగిలుండగానే రాజీనామా చేయడం గమనార్హం. ఆయన 2017 నుంచి యూపీఎస్సీ బోర్డులో మెంబర్‌గా ప ని చేస్తున్నారు. యూపీఎస్సీ స భ్యుడిగా బాధ్యత లు స్వీకరించక ముందు మనోజ్ గుజరాత్‌లోని ఓ యూనివర్సీటీలో వైస్ చాన్స్‌లర్‌గా సేవలందించారు. 2029 వరకు పదవీకాలం ఉంది. ఆయనకు ముందు నుంచే ఈ పదవి చేపట్టడం ఇష్టం లేదని అధికారులు పేర్కొంటున్నారు. ఐదు సంవత్సరాల పదవి ఉండగానే మనోజ్ సోనీ రాజీనామా చేయ డం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ట్రైయినీ ఐఏఎస్ ఆఫీసర్ పూజా ఖేద్కర్ వివాదాల వల్లే ఆయన తన పదవికి రాజీనా మా చేశాడా అని అంతా చర్చించుకుంటున్నారు.