calender_icon.png 17 January, 2025 | 5:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్తకొండ వీరన్న ఆలయంలో కోలాహలం

17-01-2025 01:28:41 AM

* స్వామివారి సన్నిధిలో నాగవెల్లి, పుష్పయాగం

భీమదేవరపల్లి, జనవరి 16 (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరన్న సన్నిధిలో నాగవెల్లి, పుష్పయాగం పురస్కరించుకొని ఆలయంలో భక్తులతో కోలాహలంగా మారింది. గురువారం స్వామివారి సన్నిధిలో దేవీదేవతల కల్యాణంలో భాగంగా వసంత మండపంలో నీలలోహిత పూజలు ఆలయ అర్చకులు కంచనపల్లి రాజయ్య, మొగిలిపాలెంరాంబాబు, వినయ్‌శర్మ, కొత్తకొండ ఆలయ చైర్మన్ చంద్రశేఖర్‌గుప్తా, ఈవో కిషన్‌రావు, డైరెక్టర్ కొంగొండ సమ్మయ్యలు నిర్వహించారు.

అమ్మవారికి నల్లపూసలను అర్చకులు ధరింపజేశారు. తదుపరి పుష్పోత్సవం సప్తవర్ణాల ఏకాంత సేవలు ఆలయ అర్చకులు నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా వీరభద్రుడు మరింత తేజోవంతుడై భక్తులను అను గ్రహిస్తాడని నమ్మకం.