calender_icon.png 29 April, 2025 | 8:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉప్పులేటి నరేష్

28-04-2025 05:20:57 PM

నియామక పత్రం అందజేసిన జాతీయ ఉపాధ్యక్షులు మామిడిపల్లి బాపయ్య...

మందమర్రి (విజయక్రాంతి): ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా పట్టణానికి చెందిన ఉప్పులేటి నరేష్ నియమించారు. శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్ లో సోమవారం నిర్వహించిన సమావేశంలో నియామక పత్రాన్ని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మామిడిపల్లి బాపయ్య అందజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ స్థాయిలో పని చేస్తున్న ఏకైక సంఘమని 16 రాష్ట్రాల్లో విస్తరించి అణగారిన వర్గాలకు అండగా నిలుస్తుందన్నారు. దీనిలో భాగంగా మంచిర్యాల జిల్లాలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం కమిటీని నిర్మాణం చేసేందుకు కమిటీలు వేస్తున్నట్లు ఆయన తెలిపారు.

బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీ గ్రామ గ్రామాన తీసుకెళ్లేందుకు జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఉప్పులేటి నరేష్ ను నియమిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియామకమైన ఉప్పులేటి నరేష్ మాట్లాడు తూ తనపై నమ్మకంతో  ఈ బాధ్యతలను అప్పగించిన ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు ఎస్. వరుణ్ కుమార్, జాతీయ ఉపాధ్యక్షుడు మామిడిపల్లి బాపయ్య, రాష్ట్ర అధ్యక్షుడు కాడారం అరుణ్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు నెరువట్ల రాజలింగులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ను జిల్లాలో పటిష్టం చేసి భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బాబాసాహెబ్ బి. ఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ఎస్సి, ఎస్టి, బిసీ, మైనారిటీల ఐఖ్యతకు కృషీ చేస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్, సీనియర్ జర్నలిస్ట్ బొంకూరు మధు, రాష్ట్ర ఉపాధ్యక్షులు మైస రాజేష్, కాంపెల్లి సతీష్, సీనియర్ నాయలు రాజన్న మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు నెరువట్ల రాజలింగు, జిల్లా ఉపాధ్యక్షులు ఆసంపల్లి శ్రీనివాస్ లు పాల్గొన్నారు.