calender_icon.png 26 March, 2025 | 6:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉప్పల్ నారపల్లి ప్లైఓవర్ పనులు పూర్తి చేయాలి

23-03-2025 12:00:00 AM

  1. చెంగిచర్ల చౌరస్తా నుంచి ఉప్పల్ రింగ్ రోడ్ వరకు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పాదయాత్ర
  2. ముఖ్యఅతిథిగా పాల్గొన్న సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ

మేడిపల్లి,మార్చి22(విజయక్రాంతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఉప్పల్ - నారాపల్లి (మేడిపల్లి) ఫ్లై ఓవర్ పనులు పూర్తిచేయాలని సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. చెంగిచర్ల చౌరస్తా నుండి ఉప్పల్ రింగ్ రోడ్ వరకు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్రలో అయన పాల్గొన్నారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఉప్పల్ - నారాపల్లి (మేడిపల్లి) ఫ్లైఓవర్ పను లు 2018 జూలైలో ప్రారంభించారు. 2020 జూలై నాటికి పూర్తి చేయాలి. కాని ఏడు సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ కేవలం 40శాతం పనులే పూర్తయ్యాయి. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల పనులు పూర్తికాక ప్రజలు, వాహన దారులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు.

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, స్థానిక ఎంపి ఈటెల రాజేందర్ ఈ ప్రాజెక్టు పూర్తిచేసేందుకు తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని డిమాం డ్ చేశారు. ప్రాజెక్టు పర్యవేక్షణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది. గతంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యమే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేస్తుంది. బిజెపి కేంద్ర ప్రభుత్వం ప్రజలపై సానుభూతి తప్ప... పనులు మాత్రం చేయట్లేదని పేర్కొన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు వెంటనే ఉప్పల్ - నారాపల్లి (మేడిపల్లి) ఫ్లై ఓవర్ పనులు పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి సత్యం, సీనియర్ నాయకులు డిజి నరసింహరావు, వర్గ సభ్యులు జే,చంద్రశేఖర్, కోమ టి రవి, ఎం. వినోద, ఎర్ర అశోక్, జి.శ్రీనివాసులు,రాజశేఖర్ సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు వెంకన్న, రాథోడ్ సంతోష్, లింగస్వామి, నరేష్, సబితా, లక్ష్మణ్, సిపిఎం నాయకులు చింతల యాదయ్య, శ్రీమన్నారాయణ, మేడిపల్లి మండల కార్యదర్శి సృజన, శారద తదితరులు పాల్గొన్నారు.