calender_icon.png 15 October, 2024 | 3:33 PM

ఎంబీబీఎస్ విద్యార్థిని చదువుకి బాసటగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

15-10-2024 01:09:14 PM

స్వయంగా ఎంబీబీఎస్ విద్యార్థి ఇంటికి వెళ్లి చెక్కును అందజేసిన ఉప్పల్ ఎమ్మెల్యే

కాప్రా, (విజయక్రాంతి): కాప్రా సర్కిల్, మల్లాపూర్ డివిజన్ సూర్యనగర్ కాలనీకి చెందిన బొజ్జ సురేష్ కూతురు బొజ్జ తులసి భవాని ఉస్మానియా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించింది. ఫీజు కట్టలేక ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న ఉప్పల్ శాసనసభ్యుడు బండారు లక్ష్మారెడ్డి గారు తన స్వంత నిధులతో BLR చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంబీబీఎస్ కి అయ్యే ఫీజు 29,000/- రూపాయల చెక్కు వారి ఇంటికి వెళ్లి అందజేయడం జరిగింది. ఈ సందర్బంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు మాట్లాడుతూ.. ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని ఎవరైనా ఎంబీబీఎస్ సీటు సాధిస్తే ఫీజు మొత్తం తానే చెల్లిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి BRS పార్టీ నాయకులు వాసు, కుంటి కృష్ణ, అల్లాడి కృష్ణ యాదవ్, వీర స్వామి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.