calender_icon.png 26 October, 2024 | 12:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

10 రోజుల్లో ఉప్పల్ ఫ్లుఓవర్ పనులు ప్రారంభం

05-08-2024 01:39:28 AM

మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి 

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 4 (విజయక్రాంతి): ఉప్పల్ చౌరస్తా నుంచి నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులు పది రోజుల్లో ప్రారంభించి దసరా నాటికి పూర్తి చేయాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆదేశించారు. శనివారం ఆయన నేషనల్ హైవే అథారిటీ అధికారులు, ఆర్ అండ్ బీ అధికారులతో కలిసి ఫ్లుఓవర్ పనులను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం ఫ్లుఓవర్ గురించి పట్టించుకోలేదని, దీంతో ఆరేళ్లుగా పనులు కొనసాగు తున్నాయన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం హైదరాబాద్‌ను విశ్వనగరం చేస్తామని బీరాలు పలికి, ఫ్లుఓవర్‌ని సైతం పూర్తి చేయలేదని దుయ్యబట్టారు.

మూడు నెలల్లో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి 6 లేన్ల రోడ్డు నిర్మానం పూర్తి చేస్తామన్నారు. నవంబరు 1న అంబర్‌పేట ఫ్లుఓవర్‌ను ప్రారంభించి అందుబాటులోకి తెస్తామన్నా రు. డిసెంబరులో మూసీ  ప్రక్షాళన పనులు చేపడతామన్నారు. మంత్రి అనంతరం  నేషనల్ హైవే అథా రిటీ, ఆర్‌అండ్‌బీ అధికా రులతో ఉప్పల్ కారిడార్‌పై సమీక్షించారు. రోడ్డు పూర్తి చేసేందుకు సుమారు రూ.200 నుంచి రూ. 500 కోట్లు అవసరమవుతాయని తెలిపారు.

నిధులు విడుదల య్యేలా చూస్తానని మంత్రి హామీ ఇచ్చారు. పర్యటనలో ఎంపీ ఈటల రాజేందర్, ఉప్ప ల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, పీర్జాదిగూడ మేయ ర్ జక్క వెంకట్‌రెడ్డి, బోడుప్పల్ మేయర్ తోటకూర అజయ్ యాదవ్, ఆర్‌అండ్‌బీ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్, సెక్రటరీ హరిచందన, ఈఎన్సీ గణపతిరెడ్డి, ఎంఓఆర్టీహెచ్ రీజినల్ ఆఫీసర్ రజాక్, మేడ్చల్ అదనపు కలెక్టర్ విజయేందర్‌రెడ్డి ఉన్నారు.