calender_icon.png 20 November, 2024 | 11:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనుల్లో వేగం పెంచాలి

29-06-2024 12:38:25 AM

కేంద్రమంత్రి గడ్కరీకి ఎంపీ ఈటల విజ్ఞప్తి

హైదరాబాద్, జూన్ 28 (విజయక్రాంతి) : హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతల జిల్లాల ప్రజలకు ఇబ్బందిగా మారిన ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులు త్వరగా పూర్తి చేయాలని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరినట్లు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. కేంద్రమంత్రితో సమావేశం అనం తరం ఢిల్లీ తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ఎప్పుడు లేనన్ని జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతోందన్నారు. నితిన్ గడ్కరీని కలిసి మల్కాజిగిరి నియోజకవర్గం తోపాటు రాష్ట్రంలోని పలు సమస్యలను వివరించినట్లు తెలిపారు.

కొంపల్లిలో ఫ్లు ఓవర్లు,  అండర్ పాస్, నత్తనడక నడుస్తున్న ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్, శామీర్ పేట రోడ్డు, ఎల్బీనగర్ అండర్ పాస్ పనులను త్వరగా పూర్తి చేయాలని కేంద్రమంత్రిని కోరినట్లు తెలిపారు. హైదరాబాద్‌లో అండర్ పాస్‌ల వల్ల దుమ్ము, ధూళి పేరుకునే ప్రమాదం ఉంటుందని, కొన్నింటిని ఫ్లుఓవర్లుగా మార్చాలని విజ్ఞప్తి చేసినట్లు ఈటల వెల్లడించారు. హుజూరాబాద్‌లో సింగాపూర్, రాంపూర్, రంగాపూర్, పెద్దపా పాయపల్లిలో రైతులకు ఇబ్బంది లేకుండా సర్వీస్ రోడ్డు నిర్మాణం చేయాలని కోరినట్లు తెలిపారు.