calender_icon.png 1 April, 2025 | 11:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్తంభించిన యూపీఐ సేవలు!

27-03-2025 01:38:37 AM

సమస్య పరిష్కారమైందన్న ఎన్‌పీసీఐ

న్యూఢిల్లీ, మార్చి 26: దేశవ్యాప్తంగా యూపీఐ సేవల్లో అంతరాయం ఏర్పడింది. దీంతో యూపీఐ సేవలందించే పేటీఎం, గూగుల్ పే, ఫోన్‌పే వంటి థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా చేసే నగదు చెల్లింపులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దేశవ్యాప్తంగా గంటల పాటు యూపీఐ సేవలు నిలిచిపోవడంతో అనేక మంది వినియోగదారులు సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదులు చేశారు.

దీనిపై స్పందించిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) ‘అవును యూపీఐ సేవల్లో అంతరాయం ఏర్పడిన మాట నిజమే. సాంకేతిక సమస్యల కారణంగా సేవలపై తాత్కాలిక ప్రభావం పడింది. పాక్షికంగా లావాదేవీలు ఫెయిల్ అయ్యాయి. ఇప్పుడు సమస్య పరిష్కారం అయింది. వినియోగదారుల కు కలిగిన అసౌకర్యానికి చింతిస్తు న్నాం’ అని ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిం ది. యూపీఐ సేవలు నిలిచిపోవడం తో యూజర్లు మీమ్స్‌తో సమస్యను ప్రస్తావించారు.