calender_icon.png 11 January, 2025 | 12:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూపీఐ రికార్డు

03-01-2025 12:00:00 AM

డిసెంబర్‌లో 1,673 కోట్ల లావాదేవీలు

న్యూఢిల్లీ, జనవరి 2 :  డిసెంబర్ నెలలో యూనీఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) లావాదేవీలు రికార్డుస్థాయిలో జరిగా యి. నవంబర్ నెలతో పోలిస్తే లావాదేవీలు 8 శాతం పెరిగి 1,673 కోట్లకు చేరినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్‌పీసీఐ) విడుదల చేసిన గణాంకాలు వెల్లడిస్తున్నా యి. నవంబర్ నెలలో 1,548 కోట్ల యూపీ ఐ లావాదేవీలు జరిగాయి. లావాదేవీల వి లువ డిసెంబర్‌లో రూ.23.25 లక్షల కోట్లకు పెరిగింది. నవంబర్‌లో రూ.21.55 లక్షల కో ట్ల విలువైన లావాదేవీలు నమోదయ్యాయి. 

రోజుకు రూ. 75 వేల కోట్ల లావాదేవీలు

డిసెంబర్‌లో రోజుకు సగటున రూ.74,990 కోట్ల విలువైన 53.97 కోట్ల లావాదేవీలు జరిగాయి. నవంబర్ నెలలో సగటున రూ.71,840 కోట్ల విలువైన 51.61 కోట్ల లావాదేవీలు నమోదైనట్లు ఎన్‌పీసీఐ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 

ఫోన్‌పే, గూగుల్ పేకు ఊరట

యూపీఐ లావాదేవీల్లో మార్కెట్ లీడర్లుగా ఉన్న పేమెంట్ యాప్స్ ఫోన్‌పే, గూగుల్ పేకు ఊరట లభించింది. యూపీఐ లావాదేవీల పరిమాణంపై విధించిన 30 శాతం పరిమితిని ఎన్‌పీసీఐ మరో రెండేళ్లు పొడిగించింది. దీనితో 2026 డిసెంబర్ వరకూ పరిమితిలేకుండా యూపీఐ లావాదేవీలను పేమెంట్ యాప్స్ ప్రాసెస్ చేసుకోవచ్చు. గడువు పొడిగింపు ఇది మూడోసారి.

యూపీఐ యాప్స్ లావాదేవీల పరిమాణం 30 శాతం మించరాదన్న పరిమితిని 2020 నవంబర్‌లో ఎన్‌పీసీఐ ప్రతిపాదించింది. ఈ నిబంధన పాటింపునకు రెండేండ్లు గడువు ఇచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న యూపీఐ లావాదేవీల్లో 80 శాతం వాటా గూగుల్ పే, ఫోన్ పే తదితర థర్డ్‌పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్లవే. ఎన్‌పీసీఐ ప్రతిపాదన ప్రకారం ఆయా యాప్స్ ప్రాసెస్ చేసే లావాదేవీల పరిమాణం మొత్తం లావాదేవీల్లో 30 శాతం మించితే కొత్త కస్టమర్లను చేర్చుకోకూడదు.