calender_icon.png 11 October, 2024 | 2:00 PM

యూపీఐ లైట్ వ్యాలెట్ పరిమితి రూ.5,000కు పెంపు

10-10-2024 12:00:00 AM

ముంబై, అక్టోబర్ 9: బహుళ ప్రాచుర్యం పొందిన మొబైల్ ఫోన్ల ద్వారా జరిపే ఇన్‌స్టెంట్ పేమెంట్ సిస్టమ్ మరింత విస్త్రతమయ్యేందుకు వీలు కల్పిస్తూ యూపీఐ లైట్ వ్యాలెట్ పరిమితిని రూ. 5,000కు, ఒక్కో లావాదేవీ పరి మితిని రూ.1,000కు రిజర్వ్‌బ్యాంక్ పెంచి ంది. ప్రస్తుత ఈ వ్యాలెట్ మొత్తం పరిమితి రూ.2,000కాగా, ఒక్కో లావాదేవీ పరిమితి రూ.500 చొప్పున ఉన్నది.

ఎలాంటి పిన్ ఎంటర్‌చేయకుండానే డబ్బు బదిలీ చేయడానికి యూపీఐ లైట్ వ్యాలెట్ ద్వారా సాధ్యమవుతుంది. అలా గే ఫీచర్ ఫోన్లలో యూపీఐ123పే ఒక్కో లావాదేవీ పరిమితిని రూ. 5,000 నుంచి రూ. 10,000కు పెంచుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్‌దాస్ తెలిపారు. 2022 మార్చిలో ప్రవేశపెట్టిన యూపీఐ123 ఫీజర్‌ఫోన్ యూజర్లకు యూపీఐ చెల్లింపులకు వీలు కల్పిస్తుంది. ఈ సదుపాయం ప్రస్తుతం 12 భాషల్లో లభ్యమవుతున్నది. 

ఆర్టీజీఎస్, నెఫ్ట్ సిస్టమ్స్‌లో కొత్త సదుపాయం

రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ సిస్టమ్ (ఆర్టీజీఎస్), నేషనల్ ఎలక్ట్రానిక్ ట్రాన్స్‌ఫర్ (నెఫ్ట్) సిస్టమ్స్‌లో బెనిఫీషియరీ ఖాతా పేరును చూసే సదుపాయా న్ని ప్రవేశపెడుతున్నట్లు దాస్ ప్రకటించారు. అలాగే యూపీఐ, ఐఎంపీఎస్ వంటి పేమెంట్ సిస్టమ్స్‌లో చెల్లింపు లావాదేవీ జరిపేముందు నిధుల్ని పొందే వారి పేరును  (రిసీవర్) పంపేవారు (రెమిటర్) వెరీఫై చేసుకునే సదుపాయాన్ని అందించనున్నట్లు తెలిపారు.

ఆర్టీజీఎస్, నెఫ్ట్ సిస్టమ్స్‌లో ఇటువంటి సదుపాయం కల్పించాలంటూ వినతులు అందాయని, అందుకు స్పందనగా ఈ సిస్టమ్స్ ద్వారా రెమిటర్ నిధుల్ని బదిలీ చేసేముందు బెనిఫీషియరీ అకౌంట్ హోల్డర్ పేరును వెరీఫై చేసుకునే వీలు కల్పిస్తున్నట్లు ఆర్బీ ఐ గవర్నర్ వివరించారు. ఈ సదుపా యం కారణంగా రెమిటర్లు బెనిఫీషియరీ అ కౌంట్ నంబర్‌ను, బ్రాంచ్ ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ను ఎంటర్‌చేసిన తర్వాత బెనిఫీషియరీ పేరు డిస్‌ప్లే అవుతుంది.