ముంబై, డిసెంబర్ 4: మొబైల్ ఫోన్ల ద్వారా చెల్లింపు విధానాన్ని ప్రోత్సహించేదిశగా యూపీఐ లైట్ వ్యాలెట్‌లో ఒక్కో లావాదేవీ పరిమితిని రూ.500 నుంచి రూ.1,000కు, ఏ సమయంలోనైనా మొత్తం జరిపే చెల్లింపుల పరిమితిని రూ.2,000 నుంచి రూ.5,000కు పెంచుతున్నట్లు బుధవారం రిజర్వ్‌బ్యాంక్ ప్రకటించింది.అడిషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ అథెంటికేషన్ (ఏఎఫ్‌ఏ) లేకుండా ఆఫ్‌లైన్‌లో లావాదేవీలు జరుపుకునేందుకు యూపీఐ లైట్‌ను ఉద్దేశించారు.