calender_icon.png 20 September, 2024 | 10:20 PM

అప్ గ్రేడ్ అయిన అంగన్వాడి టీచర్లకు పూర్తి జీతం చెల్లించాలి

20-09-2024 07:41:37 PM

హెల్పర్లను నియమించాలి 

సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా 

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): జిల్లాలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మెనీ అంగన్వాడీల నుంచి మెయిన్ అంగనవాడీలుగా అప్ గ్రేట్ చేసిన టీచర్లకు పూర్తి వేతనం రూ13,650 చెల్లించాలన్నారు. ఆయా కేంద్రాల్లో హెల్పర్లను నియమించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నా నుద్దేశించి సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కే.బ్రహ్మచారి, అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పద్మ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలు చెప్పి అంగన్వాడీ టీచర్లను మోసం చేసిందని విమర్శించారు.

మెనీ అంగన్వాడీ కేంద్రాల నుంచి మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా అప్గ్రేడ్ చేసి తొమ్మిది నెలలు పూర్తయిన తర్వాత ఐదు నెలలు మాత్రం పూర్తిస్థాయి వేతనాలు చెల్లించి గత నాలుగు నెలలుగా మినీ అంగన్వాడి వేతనాలు చెల్లిస్తూ దగా చేస్తోందని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా అప్ గ్రేట్ చేసిన టీచర్లందరికి సక్రమంగా రూప్ 13,650 చెల్లించాలని, ఆయాల నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆయా కేంద్రాల్లో ఆయాలు లేక టీచర్ ఒక్కరే ఉండటంతో అత్యవసరమైతే సెలవు తీసుకోవాలంటే మనిషిని ఏర్పాటు చేయాలని, కేంద్రం మూత పడితే చర్యలు తీసుకుంటామని అధికారులు వత్తిడి చేస్తున్నారని వారు ఆరోపించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని డిడబ్ల్యుఓ విజేతకు అందజేశారు.