ఉపేంద్ర స్వీయ దర్శకత్వం వహిస్తూ.. ప్రధాన పాత్రలో నటిస్తు న్న చిత్రం ‘యూఐ’. లహరి ఫిల్మ్స్, జి మనోహరన్ అండ్ వీనస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై కేపీ శ్రీకాం త్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజా గా మేకర్స్ చిత్ర విడుదల తేదీకి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. ఉపేంద్ర మిషన్ గన్ పట్టుకుని డైనమిక్‌గా నిలుచున్న పోస్టర్‌తో సినిమాను డిసెంబర్ 20న విడు దల చేస్తున్నట్టు ప్రకటించారు. చిత్రానికి లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు.