calender_icon.png 16 March, 2025 | 3:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్రహ్మాస్త్ర 2పై అప్‌డేట్

14-03-2025 12:00:00 AM

బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు. ఒకవైపు ‘రామాయణం’ చిత్రం చేస్తూనే ‘వార్’ సినిమాలోనూ నటిస్తున్నాడు. అయితే ఇప్పటి వరకూ ‘బ్రహ్మాస్త్ర’ సీక్వెల్ ఉండదని అంతా భావించారు. దీనికి కారణం ఏంటంటే.. ‘బ్రహ్మాస్త్ర’ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడమే.

కానీ దీనికి సీక్వెల్ ఉందట. తాజాగా తన భార్య ఆలియా భట్ పుట్టినరోజు వేడుకలో రణబీర్ ఈ విషయాన్ని చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ప్రస్తుతం దర్శకుడు అయాన్ ముఖర్జీ ‘వార్ 2’పై ఫోకస్ పెట్టడంతో ‘బ్రహ్మాస్త్ర 2’ గురించి ఆలోచించే సమయం ఆయనకు లేదట. త్వరలో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఉంటుందని రణబీర్ వెల్లడించాడు.