calender_icon.png 22 February, 2025 | 4:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూపీ వారియర్స్ చిత్తు

17-02-2025 12:19:42 AM

తొలి విజయం అందుకున్న గుజరాత్ జెయిట్స్

వడోదర, ఫిబ్రవరి 16: డబ్ల్యూపీఎల్ సీజన్ గుజరాత్ జెయిట్స్ తొలి విజయం సాధించింది. వడోదరలో ఆదివారం యూపీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన యూపీ నిర్ణితయ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని గుజరాత్ 18 ఓవర్లలోనే, నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది.

గుజరాత్ బాటర్లలో ఆష్లీన్ గార్డ్‌నర్ 52 (32 బంతులు, 5 ఫోర్లు, 3 సిక్సులు) అర్ధసెంచరీతో రాణించగా.. వోల్వార్ట్స్ (22), హర్లీన్ డియోల్ (34 నాటౌట్), డియాండ్రా డాటిన్ (33 నాటౌట్) పరుగులతో రాణించారు.

యూపీ బౌలర్లలో ఎకిల్‌స్టోన్ 2, గ్రేస్ హారిస్, తాహిలా మెక్‌గ్రాత్ చెరో వికెట్ పడగొట్టారు. యూపీ బ్యాటర్లలో దీప్తి శర్మ 39 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. మిగతావారు తక్కువ పరుగులకే ఔటయ్యారు. గుజరాత్ బౌలర్లలో ప్రియ 3, డియాండ్రా 2, ఆష్లీన్ 2, గౌతమ్ ఒక వికెట్ పడగొట్టారు.