calender_icon.png 21 December, 2024 | 10:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్పెషల్ డ్రైవ్ పనులను వేగవంతం చేయండి

15-10-2024 01:03:55 AM

జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 14(విజయక్రాంతి) : సీవరేజ్ సమస్యల పరిష్కారానికి చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌కు సంబంధించి  జలమండలి ప్రధాన కార్యాలయంలో డాష్‌బోర్డు ఏర్పాటు చేసినట్లు  ఆ విభాగం ఎండీ అశోక్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఖైరతాబాద్‌లోని ప్రధాన కార్యాల యంలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.

ఆయన మాట్లాడుతూ.. ఎంసీసీకి వచ్చే ఫిర్యాదులను ఆయా క్యాన్ నంబర్లు, జీపీఎస్ ఆధారంగా గూగుల్ మ్యాప్‌లో నమోదు చేస్తున్నామాన్నారు. ఒక ప్రాంతం లో ఎన్నిసార్లు ఫిర్యాదులు వచ్చాయి, ఎన్నిసార్లు సమస్యను పరిష్కరించారో తదితర వివరాలను ఆ మ్యాప్‌లో బబుల్‌లా కనిపించేలా ఏర్పాటు చేశామన్నారు. ఫిర్యాదుల సంఖ్యను బట్టి ఆ బబుల్ పరిమాణం మారుతుందని చెప్పారు.

మ్యాన్‌హోళ్లు, డీసిల్టింగ్ వివరాలను ప్రతిరోజు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని అధికారులకు సూచించారు. మ్యాన్‌హోళ్లలో తీసిన వ్యర్థ్ధాలను డంపింగ్ యార్డుకు తరలించాలని, అవసరమైన స్థలాలను పరిశీలిం చాలన్నారు. అలాగే డ్రైబోర్‌వెల్స్‌పై జరుగుతున్న సర్వేను వేగవంతం చేయడంతోపాటు ఇళ్లలో ఇంకుడుగుంతలు లేని వారికి నోటీసులివ్వా లన్నారు.

2025 జనవరి నుంచి ట్యాంకర్ బుకింగ్ చేసే వారికి అదనపు చార్జీలు వసూలు చేస్తామని చెప్పారు. ఓటీఎస్ బకాయిలకు సంబంధించిన వివరాలను బకాయి దారులకు ఎస్‌ఎంఎస్ ద్వారా పంపించాలన్నారు. అలాగే బిల్లు చెల్లింపునకు చెందిన లింకును పంపాలని సూచించారు. సమావేశంలో ఈఎన్సీ వీఎల్ ప్రవీణ్‌కుమార్, డైరెక్టర్లు స్వామి, విజయరావు, సీజీఎంలు, జీఎంలు, డీజీఎంలు పాల్గొన్నారు.