calender_icon.png 5 January, 2025 | 7:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూపీ రుద్రాస్ ఘన విజయం

02-01-2025 11:41:40 PM

భువనేశ్వర్: హీరో హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్)లో యూపీ రుద్రాస్ ఘన విజయం సాధించింది. గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో యూపీ రుద్రాస్ 3 సూర్మా హాకీ క్లబ్‌పై గెలుపొందింది. యూపీ తరఫున సుదీప్ చిర్మాకో (ఆట 2వ నిమిషం), జొబన్‌ప్రీత్ సింగ్ (38వ ని.లో), అక్ష్‌దీప్‌సింగ్ (58వ ని.లో) గోల్స్ సాధించారు. ఈ విజయం యూపీ రుద్రాస్‌కు రెండోది కావడం విశేషం. ఇక మ్యాచ్ ప్రారంభమైన రెండో నిమిషంలోనే సుదీప్ యూపీకి గోల్ అందించి ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు.

ఆ తర్వాత రెండు క్వార్టర్స్ పాటు ఇరుజట్లు ఎలాంటి గోల్స్ చేయలేదు. మూడో క్వార్టర్స్‌లో జొబన్‌ప్రీత్ లెఫ్ట్ వింగ్ కార్నర్ నుంచి బంతిని గోల్ పోస్ట్‌లోకి తరలించి యూపీ ఆధిక్యాన్ని 2 పెంచాడు. ఇక ఆట ముగుస్తుందనగా అక్ష్‌దీప్ గోల్‌తో మెరవడంతో యూపీ తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. ఈ విజయంతో యూపీ రుద్రాస్ పట్టికలో అగ్రస్థానానికి చేరుకోగా.. సూర్మా హాకీ క్లబ్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఒక ఓటమి, ఒక డ్రాతో ఐదో స్థానంలో ఉంది.