calender_icon.png 27 December, 2024 | 5:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెమీస్‌లో యూపీ, పట్నా పైరేట్స్

27-12-2024 01:15:42 AM

పీకేఎల్ 11వ సీజన్

పుణే: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్‌లో యూపీ యోధాస్ సెమీస్‌లో అడుగుపెట్టింది. గురువారం పుణే వేదికగా జరిగిన తొలి ఎలిమినేటర్ పోరులో యూపీ యోధాస్ 46-18తో జైపూర్ పింక్ పాంథర్స్‌ను చిత్తుగా ఓడించింది. భవానీ రాజ్‌పుత్ (12 పాయింట్లు), హితేశ్ (6 పాయింట్లు), గగన్ గౌడ, సుమిత్ చెరో 5 పాయింట్లతో విజయంలో కీలకపాత్ర పోషించారు.

ఇక యూపీ యోధాస్ సెమీస్‌లో హర్యానా స్టీలర్స్‌ను ఎదుర్కోనుంది. రెండో ఎలిమినేటర్ పోరులో పట్నా పైరేట్స్ 31-23 తేడాతో యు ముంబాపై గెలుపొందింది. పట్నా రైడర్ అయార్ సూపర్ టెన్‌తో మెరవగా.. దేవాంక్ 8 పాయింట్లు సాధించాడు. రెండో సెమీస్‌లో పట్నా పైరేట్స్ దబంగ్ ఢిల్లీతో అమీతుమీకి సిద్ధమైంది.