06-03-2025 11:35:45 PM
యూపీ బాలిక కిడ్నాప్, అత్యాచారం కేసు
విచారణలో వెలుగులోకి కొత్త విషయాలు
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన 14 ఏళ్ల దళిత బాలిక కిడ్నాప్, అత్యాచారం కేసులో తాజాగా కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. బాలికను కిడ్నాప్ చేసిన తర్వాత ఆమె చేతిపై ఉన్న ‘ఓం’ టాటూను యాసిడ్‌తో కాల్చి చెరిపేశారని, ఆ తర్వాత బలవంతంగా మాంసాహరం తినిపించినట్లు భగత్‌పూర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సంజయ్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మతోన్మాదంతో రెచ్చిపోయిన నిందితులు బాలికను హింసించి పైశాచిక ఆనందాన్ని పొందారని తెలిపారు.
ఈ ఏడాది జనవరి 2న జరిగిన ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. రెండు నెలల తర్వాత వారి నుంచి తప్పించుకున్న బాధితురాలు ఈ నెల 2న ఇంటికి తిరిగివచ్చింది. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోక్సో చట్టం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా బాలికపై దారుణానికి ఒడిగట్టిన నలుగురిలో ఒకరిని అదుపులోకి తీసుకోగా.. మరో ముగ్గురు మాత్రం పరారీలో ఉన్నారు. బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టిన నలుగురు నిందితులను సల్మాన్, జుబెయిర్, రషీద్, ఆరిఫ్‌లుగా గుర్తించారు.