ప్రయాగ్ రాజ్,(విజయక్రాంతి): మహా కుంభమేళా తొక్కిసలాట(Maha Kumbh Mela Stampede) జరిగింది. ఈ ఘటనలో దాదాపు 20 మందికి పైగా చనిపోగా, 100 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. మహా కుంభమమేళాపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్(UP CM Yogi Adityanath), యూపీ సీఎస్ మనోజ్ కుమార్ సింగ్(UP CS Manoj Kumar Singh), డీజీపీ, హోంశాఖ ముఖ్యకార్యదర్శులతో ఎప్పటికప్పడు సమీక్షిస్తున్నారు. అక్కడ శాంతి భద్రతల ఏడీజీ, సీఎంవో అధికారులతో నిరంతరం అడిగి తెలుసుకున్నారు. ఇవాళ మౌని అమావాస్య(Mauni Amavasya) కావడంతో ప్రయాగ్ రాజు మహాకుంభమేళాకు భక్తజనం పోటెత్తుతునున్నారు. పుణ్యస్నానాలు ఆచరించేందుకు సంగమం వద్ద బుధవారం ఉదయం 6 గంటల వరకు 1.75 కోట్ల మంది భక్తులు తరలివచ్చారు. నిన్నటి వరకు 19.94 కోట్ల మంది పుణ్యస్నానాలు చేసినట్లు యూపీ ప్రభుత్వం వెల్లడించింది.
కుంభమేళ తొక్కిసలాట ఘటనపై ఎప్పటికప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యవేక్షిస్తున్నారు. మహాకుంభమేళా సంఘటనపై ప్రధానమంత్రి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగితో ఇవాళ మూడుసార్లు మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని నిర్ధేశించారు.మౌని అమావాస్య నాడు జరిగే అమృత స్నానం మహా కుంభమేళాలో అత్యంత ముఖ్యమైన ఆచారం, దాదాపు 10 కోట్ల మంది యాత్రికులను వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ సంవత్సరం, 144 సంవత్సరాల తర్వాత వచ్చే త్రివేణి యోగం అనే అరుదైన ఖగోళ అమరిక జరుగుతోంది. ఇది ఇవాళ ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను పెంచుతుంది.