calender_icon.png 15 November, 2024 | 10:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏడుగురి మృతి పట్ల యూపీ సీఎం సంతాపం

04-08-2024 11:54:35 AM

యూపీ: లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై ఢిల్లీకి వెళ్లే డబుల్ డెక్కర్ బస్సు కారును ఢీకొనడంతో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై యూపీ ముఖ్యమంత్రి యోగి అధిత్య నాథ్ స్పందించారు. ఏడుగురి మృతి పట్ల యూపీ సీఎం యోగి సంతాపం తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న సీఎం యోగి ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు సరైన చికిత్స అందించాలని స్థానిక అధికారులకు సూచించారు. అంతకుముందు జూలై 30న, కేబినెట్ మంత్రి నంద్ గోపాల్ నంది కుమారుడి కారు కూడా కన్నౌజ్ సమీపంలోని ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వే వద్ద ప్రమాదానికి గురైంది. నంది కొడుకు మెర్సిడెస్ బెంజ్ నడుపుతూ తన భార్యతో కలిసి ప్రయాణిస్తున్నాడు. తిర్వా ప్రాంతంలో డ్రైవర్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొనడంతో కారు బోల్తా పడింది.