కోరుట్ల, డిసెంబర్ 25 (విజయ క్రాంతి): సనాతన ధర్మ ప్రచార సమితి ఆధ్వర్యంలో జనవరి 1 నుండి జనవరి 7 వరకు కోరుట్ల వాసవి కల్యాణ భవనములో శృంగేరి పీఠం ఆస్థాన పౌరాణికులు పురాణ ప్రవర బ్రహ్మ గర్రెపల్లి మహేశ్వర శర్మ గారిచే నిర్వహించ నున్న “అష్టాదశ పురాణ ప్రవచన జ్ఞాన యజ్ఞము” ఆహ్వాన కరపత్రాల ఆవిష్క రణ వాసవి కళ్యాణ భవనంలో జరిగింది. అత్యం త ముక్తిదాయకమైన కార్యక్రమంలో పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయ వంతం చేయాలని నిర్వాహకులు కోరారు.