11-02-2025 01:22:00 PM
మణుగూరు,(విజయక్రాంతి): మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని దేవాదాయ ధర్మదాయ శాఖ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవస్థానం(Manuguru Sri Neelakanteswara Swamy Temple)లో మంగళవారం మహాశివరాత్రి వేడుకల(Mahashivratri Celebrations) విస్తృత ప్రచార నిమిత్తం గోడ పత్రికలు, కరపత్రాలను ఆవిష్కరించారు. ఫిబ్రవరి 26న నిర్వహించే మహా శివరాత్రి వేడుకల్లో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లను ఘనంగా చేపట్టాలని ఈ సందర్భంగా ధర్మకర్తల మండలి చైర్మన్ కూచిపూడి వెంకటేశ్వరరావు (బాబు) అన్నారు. కార్యక్రమంలో పరిశీలకులు దేవాదాయ ధర్మదాయ శాఖ కొత్తగూడెం డివిజన్ పోరిక బేల్ సింగ్, కార్యనిర్వహణ అధికారి జి సుదర్శన్, సభ్యులు శ్రీ విద్య విద్యాసంస్థల డైరెక్టర్ బద్దం శ్రీనివాస్ రెడ్డి, ఆలయ అర్చక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.