14-04-2025 01:24:16 AM
విజయక్రాంతి నెట్‌వర్క్, ఏప్రిల్ 13: అకాల వర్షంతో రైతన్న ఆగమయ్యాడు. ఆదివారం సాయంత్రం పలు జిల్లాల్లో వడగండ్ల వాన, గాలిదుమారం బీభత్సం సృష్టించింది. వడగండ్లకు చేనులో వడ్లు రాలిపోగా, మక్కజొన్న పంట దెబ్బతిన్నది. భారీ వర్షానికి మార్కెట్ యార్డుల్లో ధాన్యం కొట్టుకుపోయింది.
మిర్చి పంట తడిసిపోగా, తోటల్లో మామిడి కాయలు రాలిపోయాయి. పలుచోట్ల చెట్లు నేల కూలగా, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. జనగామ జిల్లాలో సాయంత్రం 4 గంటల ప్రాంతంలో బలమైన ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసింది. కోతకు వచ్చిన వరి పంటకు నష్టం వాటిల్లింది. వడ్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొట్టుకుపోయింది.
జనగామతోపాటు లింగాల గణపురం, రఘునాథ్‌పల్లి ప్రాంతాల్లో భారీవర్షం కురిసింది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోనూ వర్షం కురిసింది. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి, నాగారం మండలా ల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. నల్లగొండ జిల్లా శాలి గౌరారం మండలంలో వడగండ్ల వర్షం అన్నదాతను ఆగం చేసింది.
వేములపల్లి మం డ లం సల్కునూరులో పిడుగుపడి సుధాకర్‌రెడ్డి (60) అనే రైతు మృతిచెందాడు. యాదాద్రి అడ్డగూడూరు మండలంలోనూ వర్షం పడిం ది. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో రైతన్నకు నష్టం వాటిల్లింది. కొనుగోలు కేంద్రా ల్లో ధాన్యం తడిసిపోయింది. ఖమ్మం నగరంతోపాటు కల్లూరు, మధిర, పెనుబల్లి, సత్తుపల్లి, చుట్టు పక్కల ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
దీంతో కల్లాల్లో, పంటపొలాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. కళ్లముందే పంట ఆగం కావడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నా రు. సత్తుపల్లి, పెనుబల్లి, వేంసూరు ప్రాంతాల్లో గాలిదుమారానికి మామిడి తోటలు దెబ్బతిన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా భారీ వర్షం కురిసింది.
ఈదురు గాలులతో కురిసిన వర్షానికి కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంత రాయం ఏర్పడింది. భద్రాచల ఆలయంలోనూ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పలుచోట్ల ఈదురుగాలులకు చెట్లు కూలిపోయాయి.
మరో రెండురోజులు వానలు
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మరో రెండురోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వ ర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుం చి విదర్భ మీదుగా తెలంగాణ మధ్య ప్రాంతం వరకు ఉపరితల ఆవర్తనం నుంచి ద్రోణి సగటున సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.
ఫలితంగా రెండు రోజులపాటు తేలి కపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సైతం 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని వా తావరణ కేంద్ర అధికారులు హెచ్చరించారు.