calender_icon.png 30 April, 2025 | 2:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్నదాతకు కన్నీటిని మిగిల్చిన అకాల వర్షం

28-04-2025 12:57:45 AM

యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 27( విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆదివారం ఉదయం కురిసిన వాన అన్న దాతల ఆశలపై నీళ్లు జల్లింది. వలి గొండ, మోటకొండూర్, ఆలేరు, యాదగిరి గుట్ట, బొమ్మాల రామారం, తుర్కపల్లి తదితర మండలాల్లో ఉరుములు, మెరుపు లతో వర్షం కురిసింది. దీంతో కోతకు వచ్చిన పంటలకు నష్టం వాటిల్లింది.

వలిగొండ మండలం లోని వివిధ  గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలకు అమ్ముకునేందుకు తీసుకొచ్చిన ధాన్యం భారీ వర్షానికి తడిసిపోయింది. వలిగొండ మార్కెట్ యార్డ్ లో వాన నీటిలో ధాన్యం కొట్టుక పోగా మహిళా రైతులు కొట్టుకుపోయింది. ఆరుగాలం కష్టాన్ని కాపాడుకునేందుకు రైతులు  పాట్లు పడ్డారు. తడిసిన తమ ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే చేసి తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.