04-04-2025 12:25:59 AM
ఎల్బీనగర్, ఏప్రిల్ 3 : ఎల్బీనగర్ నియోజకవర్గం వ్యాప్తంగా గురువారం సాయం త్రం భారీ వర్షం కురిసింది. దిల్ సుఖ్ నగర్, చంపాపేట, కర్మన్ ఘాట్, సరూర్ నగర్, కొత్తపేట, చైతన్యపురి పరిసర ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయయ్యాయి.
బీఎన్ రెడ్డి నగర్, హస్తినాపురం, హయత్ నగర్ ఆయా డివిజన్ కాలనీల్లో నాలాలు పొంగి ప్రవహిస్తున్నాయి. వర్షం కారణంగా పలు ప్రాం తాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చైతన్యపురి డివిజన్ కమలానగర్ రోడ్డు నెంబర్ 5లో భారీ వరద రావడంతో పా ర్కింగ్ చేసిన బైక్ నీటిలో కొట్టుకు పోయింది.
కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయ ప్రాంగణంలోకి వరద
చంపాపేట డివిజన్ లోని కర్మన్ ఘాట్ హనుమాన్ ప్రాంగణంలోకి వరద చేరింది. ఆలయ ప్రధాన ద్వారం నుంచి రాజాగోపు రం దాకా నీరు నిలిచిపోయింది. నీటిని తరలించటానికి ఆలయ సిబ్బంది అవస్థలు పడుతున్నారు. ఆలయ ప్రధాన ప్రవేశ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
ఇబ్రహీంపట్నంలో: ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో గురువారం సాయంత్రం నుండి ఉరుములు, మె రుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందు లు తప్పలేదు. ఇబ్రహీం పట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్మెట్ మండలాలతో పాటు ఇబ్రహీంపట్నం, తుర్కయాంజాల్, ఆదిబట్ల, పెద్దఅంబర్పేట్ మున్సిపాలిటీ పరిధిలో వర్షం పడుతోంది.
పలు గ్రామాల్లో వి ద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో గృహ వినియోగదా రులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షంలో రోడ్ల పై వెళ్ళే వాహనదారులు సాహసాలు చేయకుండా సురక్షితంగా ఇళ్లకు చేరాలని అధి కారులు సూచిస్తున్నారు.
శేరిలింగంపల్లి ప్రాంతంలో: శేరిలింగం పల్లి నియోజకవర్గంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. శేరిలింగంపల్లి తో సహా పలు ప్రాంతాలలో భారీ వర్షం కురుస్తోంది. చందానగర్, మియాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, ఆఫీస్ పెట్, ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి.
ఇవాళ మధ్యాహ్నాం 3 గంటల నుండి వర్షం కురుస్తోంది. పలుచోట్ల భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. ఇక సాయంత్రం వరకు వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజలంతా అ ప్రమత్తంగా ఉండాలని క్షేమంగా ఇళ్లకు చేరాలని అధికారులు సూచించారు.
రాజేంద్రనగర్‌లో: వర్షం దంచి కొట్టింది. గురువారం మధ్యాహ్నం సుమా రు మూడు నుంచి ప్రారంభమైన వర్షం రాత్రి వరకు కురుస్తూనే ఉంది. రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని కోకపేట, నార్సింగి, బండ్లగూడ, రాజేంద్రనగర్, శంషాబాద్ తో పాటు కార్వాన్ నియోజకవర్గం లో ని గుడిమల్కాపూర్, లంగర్ హౌస్ లో భారీ వర్షం కురిసింది.
అత్తాపూర్ కూడా కాలనీలో మోకాళ్ళ లోతు నీళ్లు వచ్చి చేరాయి. కార్ల టైర్లు మునిగిపోయాయి. అదేవిధంగా గుడిమల్కాపూర్ లో కూడా భారీ వర్షంతో జనం ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఆటోపై పడిన గోడ:-
నిర్మాణంలో ఉన్న ప్రహరీ కూలి రోడ్డుపై వెళ్తున్న ఆటోపై పడడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కర్మన్ ఘాట్ లోని గెలాక్సీ వీధిలో గురువారం సాయంత్రం జరిగింది. కర్మన్ ఘాట్ లో నివసించే నేనావత్ అనిల్, సరోజ, భాను ప్రసాద్, రమావత్ అనిల్, రెండేళ్ల చిన్నారి నందిని ఒకే కుటుంబ సభ్యులు. వీరు గురువారం సాయంత్రం యంజాల్ లోని ఒక ఫంక్షన్ కు తమ ఆటోలో వెళ్లి, తిరిగి ఇంటికి వస్తున్నారు.
కర్మన్ ఘాట్ లోని గెలాక్సీ వీధి నుంచి వస్తుండగా.. నిర్మాణంలో ఉన్న భవనం ప్రహరీ అకస్మాత్తుగా కూలీ ఆటోపై పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న అయిదుగురిలో ఇద్దరు సరోజ, అనిల్ కు గాయాలయ్యాయి. వీరిని స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై బిల్డింగ్ యజమానులు స్పందించలేదని, వారిపై చట్టపర్యమైన చర్య తీసుకోవాలని కుటుంబ సభ్యుల డిమాండ్ చేస్తున్నారు.