11-04-2025 01:42:42 AM
కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం
నాగారం, ఏప్రిల్ 10: ఆకాల వర్షంతో రైతులకు ఆపార నష్టం జరిగింది. గురువారం సాయంత్రం కురిసిన వర్షం కారణంగా నాగారం మండలం వర్ధమానుకోట, నాగారం బంగ్లా ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు ఆరబోసుకున్న ధాన్యం తడిసి ముద్దయింది. మండల వ్యాప్తంగా 7 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాగా రైతులు ఆయా కేంద్రాల్లో ధాన్యం పోశారు.
కాగా మండలంలో గురువారం సాయంత్రం ఒక్క సారిగా వర్షం కురువడంతో వర్ధమానుకోట, నాగారం బంగ్లా వద్ద ఉన్న కొనుగోలు కేంద్రాలలో రైతులు ఆరబోసిన ధాన్యం తడిసింది. సుమారు 70 మంది రైతులు ఈ కేంద్రాలలో ధాన్యం పోయగా ఇందులో 50 మంది రైతులు ధాన్యాన్ని ఆరబోశారు. అక్కడ రైతులు ఏర్పాటు చేసుకున్న టార్పలిన్లు ఇదరు గాలులకు కొట్టుకపోవడం, ఒక్కసారిగా వర్షం కురువడంతో సుమారు 7 వేల క్వింటాల ధాన్యం తడిసింది.
ఆరు కాలం కష్టపడి పండించిన ధాన్య అకాల వర్షానికి నీట మునిగిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. రైతుల ధాన్యాన్ని వర్షాల బారి నుండి కాపాడుకునేందుకు టార్పాలిన్ పట్టాలను కొనుగోలు కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచకపోవడంతో ధాన్యం తడిసినట్లు రైతులు చెపుతున్నారు.