విక్టరీ వెంకటేశ్ హీరోగా నటిస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. దిల్ రాజు సమర్పణలో శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వస్తోందీ సినిమా. ఈ సందర్భంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి శుక్రవారం విలేకరులతో ప్రత్యేకంగా సమావేశమై చిత్ర విశేషాలను పంచుకున్నారు.
‘ఎఫ్2’ పొంగల్‌కు వచ్చి పెద్ద విజయం సాధించింది. ‘ఎఫ్3’ కూడా సంక్రాంతికి రావాల్సింది కానీ మిస్ అయ్యింది. ఈ కథ ఒక రెస్క్యూ ఆపరేషన్‌కు సంబధించింది. ద్వితీయార్ధంలో నాలుగు రోజుల జర్నీ సంక్రాంతికి ముందు ఉంటుంది. కథ అనుకున్నప్పుడే ‘సంక్రాంతికి వస్తున్నాం’ టైటిల్‌కి ఫిక్స్ అయ్యాం. అందుకే సినిమా ఓపెనింగ్ అప్పుడే సంక్రాంతికి రావాలనుకున్నాం. కాకపోతే అప్పుడు ప్రకటించలేదు అంతే!
ఒక భార్య, మాజీ ప్రేయసి మధ్య నలిగే ఓ భర్త పాత్ర. -నరేశ్, వీటీ గణేశ్ పాత్రలతో ఈ కథ స్టార్ట్ అవుతుంది. ఈ ఇద్దరి పాత్రలు హైలెట్‌గా ఉంటాయి. ప్రతి ఫ్యామిలీ రిలేట్ చేసుకునే సినిమా ఇది. ప్రేక్షకులు హ్యాపీగా నవ్వుకొని వెళ్తారు.
ఐశ్వర్య రాజేశ్‌ను ఆడిషన్ చేసి తీసుకున్నామని అనుకుంటున్నారు.. అది నిజం కాదు. -భాగ్యం క్యారెక్టర్ చాలా స్పెషల్. వెరీ ఎడ్జ్‌లో నడిచేది. చాలా కేర్ తీసుకొని చేయాల్సిన క్యారెక్టర్. ఐశ్వర్య బెస్ట్ పెర్ఫార్మర్.
అయితే తను గోదారి యాస ఎలా పలుకుతుంది? ఆ క్యారెక్టర్‌లో తన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి మాత్రమే చిన్నగా ఆడిషన్‌లా చేశాం. భాగ్యం చాలా మంచి క్యారెక్టర్. ఐశ్వర్యకు మంచి పేరు వస్తుంది. -మీనాక్షి కూడా చాలా క్రమశిక్షణ గల నటి. తనకు మంచి టైమ్ సెన్స్ ఉంది. ఇద్దరూ ఆదరగొట్టారు.
దిల్ రాజుతో ‘పటాస్’ సినిమా టైమ్ నుంచి పనిచేస్తున్నా. నాకు ఎవరైనా కనెక్ట్ అయితే వాళ్లతోనే ట్రావెల్ చేయడానికి ఇష్టపడతాను. దిల్ రాజు, శిరీష్‌తో పదేళ్ల జర్నీ నాది. అందుకే వాళ్లు నాకు ఫ్యామిలీ.
‘-ఎఫ్2’, ‘ఎఫ్3’ కంటే ‘సంక్రాంతికి వస్తున్నాం’తో వెంకటేశ్‌తో నా బాండింగ్ డబుల్ అయ్యింది. ఈ సినిమాతో బెస్ట్ బడ్డీస్ అయిపోయాం.. చాలా క్లోజ్ అయ్యాం. వెంకటేశ్‌తో సినిమాలు ఇలానే కంటిన్యూ చేయాలనుకుంటున్నాను.
ఈ సినిమాతో వెంకటేశ్‌తో ఒక డిఫరెంట్ జోనర్ ట్రై చేశాను. ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు క్రైమ్ రెస్క్యూ అడ్వెంచర్‌లా ఉంటుంది. సెకండ్ హాఫ్ డిఫరెంట్ జోనర్‌లో ఉంటుంది. వెంకీ గారితో యాక్షన్ సినిమా చేసినా కూడా ఎంటర్‌టైన్‌మెంట్‌కే పెద్దపీట వేస్తాను. ఆయనతో ఆ ఎంటర్‌టైన్‌మెంట్ నాకు చాలా ఇష్టం. మిగతా హీరోల విషయంలోనూ ఫ్యాన్ బాయ్‌లానే ఉంటాను. రిలేషన్‌ను పాజిటివ్‌గా ఉంచుతాను కాబట్టి వాళ్ల నుంచి కూడా అంతే ప్రేమ వస్తుంది.
ఉమెన్ సెంట్రిక్‌గా ఒక స్పోర్ట్స్ స్టొరీ చేయాలని ఎప్పటినుంచో నాకో డ్రీమ్ ఉంది. కొన్నాళ్ల తర్వాత స్పోర్ట్స్ డ్రామా చేస్తాను. ‘ఎఫ్4’ డెఫినెట్‌గా ఉంటుంది. దానికి ఇంకా సమయం ఉంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ను కూడా ఫ్రాంచైజ్ చేసుకునే స్కోప్ ఉంది.
జీవితంలో అందరికీ ఏదో ఒక గతం ఉంటుంది. ఎక్స్‌ప్రెస్ చేయకపోయినా కనీసం ఫస్ట్ క్రస్ ఉంటుంది. పెళ్లి అయిన తర్వాత ఓపెన్‌గా ఉండాలని చెప్తే దాని సైడ్ ఎఫెక్ట్స్ మొదలవుతాయి. అందుకే గతం జోలికి పోకుండా హాయిగా ప్రజెంట్‌లో ఉండటమే మంచిది. సినిమాలోని ‘ఫ్లాష్ బ్యాకులు చెప్పొద్దు’ అనే డైలాగు వెనుక ఉద్దేశం కూడా అదే (నవ్వుతూ).
ఇటీవల నా లుక్ చూసిన చాలా మంది హీరోగా ఎంట్రీ ఇస్తారా? అని అడుగుతుంటే సమాధానం చెప్పీ చెప్పీ అలిసిపోయా. నాకూ నటించాలనే ఉంది. అయితే హీరోగా కాదు.. కథలో మెయిన్ క్యారెక్టర్స్ చేస్తా. అది కూడా ఇప్పుడు కాదు.. ఇంకాస్త ముదిరిన తర్వాత.. అంటే వయసు ఇంకా పెరిగిన తర్వాత అని అర్థం (నవ్వుతూ).
కోవిడ్ తర్వాత సినిమా సినారియో మారిపోయింది. మంచి కథ రాసి గొప్పగా తీయగానే స రిపోదు. థియేటర్లకు జనం రాకపోతే సినిమాకు రీచ్ ఉండదు. ఇప్పుడు ఆడియన్స్ బాగా సెలెక్టివ్ అయిపోయారు. మన సినిమా వారి అటెన్షన్‌ను గ్రాబ్ చేస్తేనే ఓపెనింగ్స్ తెచ్చుకోగలమని నా అభిప్రాయం. అందుకే ఈసారి సోషల్ మీడియాపై ఎక్కవ ఫోకస్ చేశాం. వెంకటేశ్ లాంటి పెద్ద స్టార్ రంగంలోకి దిగి సరదాగా అల్లరి చేయడం, రీల్స్ చేయడం ప్రమోషన్స్‌కి చాలా హెల్ప్ అయ్యింది.