calender_icon.png 15 January, 2025 | 5:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆగని ఆరోగ్య దోపిడీ?

14-01-2025 12:38:05 AM

*  కోనరావుపేటలో కార్మికులకు వైద్య పరీక్షలు

* ఉపయోగపడని పరీక్షలు 

* ప్రభుత్వ సొమ్ము కాజేసేందుకు శిబిరాలు

కోనరావుపేట, జనవరి 13: ఆరోగ్య పేరిట దోపిడీ ఆగడం లేదు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి కార్మికుల రక్తం పీల్చుతున్నారు. ఇష్టం వచ్చినప్పుడు శిబిరాలు ఏర్పాటు చేసి, వైద్య పరీక్షలు చేయాలంటూ, లేకుంటే లేబర్ కార్డు క్యాన్సల్ అవుతుందని బెదిరింపులకు పాల్పడడంతో గత్యంతరం లేక పరీక్షలు చేయించుకుంటున్నారు.

ఇదంతా నిత్యం ప్రక్రియ కొనసాగుతున్నప్పటికి, అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఇద్దరు వ్యక్తులు వైద్య శిబి రం ఏర్పాటు చేశారు. లేబరు కార్డు ఉన్న వారు రక్త పరీక్షలు చేయించుకోవాలని చాటింపు వేయించారు.

మరికొందరికి ఫోన్ల ద్వారా సమాచారం అందించి, పరీక్షలు చేయించకుంటే మీ కార్డును రద్దు చేయడంతో పాటు మీకు వచ్చే పథకాలు రావని బెదిరింపులకు పాల్పడడంతో పరీక్షలు చేయించుకుం టున్నారు. గతంలో పరీక్షలు చేయించుకున్న వారికి పరీక్ష రిపో ర్టులు ఇవ్వకుండానే తిరిగి, పరీక్షలు చేయించేందుకు శిబిరం ఏర్పాటు చేశారు.

జిల్లా వ్యాప్తంగా ఆరు బ్యాచ్లు ప్రతి గ్రామం లో తిరుగుతూ శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి లేబరు నుంచి రక్త నమూనాలు తీసుకోని, తర్వాత పరీక్ష ఫలితాల రిపోర్టులు అందిస్తామని చెబుతున్నారు. ఒక్కో పరీక్షకు ప్రభు త్వం వారికి రూ.3256లు చెల్లిస్తుంది. ఈ పరీక్షల్లో 22 రకాల పరీక్షలు చేస్తామని చెబుతున్నప్పటికి, వారికి ఎలాంటి ఉప యోగం లేకుండా పోతున్నాయి.

అందులో సదరు లేబరుకు సంబంధించిన రోగం వివరాలు ఎక్కడ కూడా వివరించ కుండానే రిపోర్టులు అందిస్తారు. ఈ రిపోర్టులు పట్టుకోని, దవాఖానకు వెళ్లితే తిరిగి పరీక్షలు చేయాలని, వాటిని చెత్త బు ట్టులో వేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో శిబిరం ఏర్పాటు చేశారనే విషయం తెలుసుకున్న విలేకర్లు వెళ్లి వివరాలు అడుగగ పొంతన లేని సమాధానం సిబ్బంది చెబు తున్నారు.

వైద్యుని పర్యవేక్షణ లేకుండా పరీక్షలు ఎలా చేస్తా రని అడగడంతో వచ్చే నెల నుంచి అందుబాటులో ఉంటారని చెప్పి, అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇప్పటికైనా అలా పరీక్షలు చేసే వారిని కట్టడి చేయాలని స్థానికులు కోరుతున్నారు.