12-02-2025 12:00:00 AM
2024లో ప్రపంచ జనాభా 820 కోట్లు చేరిందని, మరో అర్ధ శతాబ్దానికి (2080ల్లో) 1,030 కోట్లు చేరవచ్చని, ఆ తర్వాత ఒకింత తగ్గుముఖం పట్టవచ్చని ఇటీవల విడుదలైన ఒక నివేదిక స్పష్టం చేసింది. ఐరాస (ఐక్యరాజ్యసమితి) జనాభా విభాగం నేతృత్వంలో ‘వరల్డ్ పాపులేషన్ ప్రాస్పె క్ట్స్ విడుదల చేసిన ‘28వ జనాభా అంచనా’ నివేది క ఆసక్తికరమైన అంశాలను వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తం గా 237 దేశాలు, ప్రాంతాల జనాభాను 1950నుంచి నేటివరకు, తర్వాత 2100 వరకు విశ్లేషించారు.
2024లో 820 కోట్లుగా ఉన్న ప్రపంచ జనాభా మరో 50 ఏండ్ల తర్వా త అత్యధికంగా 1,030 కోట్లకు చేరే అవకాశం ఉన్నట్లు నిపుణులు తేల్చారు. 2024లో భారతదేశ జనాభా 145 కోట్లు ఉండగా, 2054 నాటికి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా 169 కోట్లకు చేరవచ్చని వారు తెలిపారు. 2100 నాటికి 80 ఏండ్లు దాటిన ప్రపంచ వృద్ధుల సంఖ్య మూడు రెట్లు పెరగవచ్చని,15 ఏండ్లలోపు, 64 ఏండ్లు దాటిన కుటుంబంపై ఆధారపడే పిల్లలు/వృద్ధుల జనాభా 77.5 శాతం చేరే అవకాశం ఉందని పేర్కొన్నారు.
2060ల్లో భారతదేశ జనా భా 170 కోట్లకు, 2070 నాటికి జనాభా 200 కోట్ల మార్కు కు చేరవచ్చని, 2100 వరకు 220 కోట్లకు చేరవచ్చనీ ‘ఐరా స’ నివేదిక స్పష్టం చేసింది. రానున్న దశాబ్దాల్లో ప్రపంచ మా నవాళి సగటు వయస్సు పెరగడం భవిష్యత్తు సంక్షోభంగా నిలువనుంది.
అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారతదేశం తన ప్రథమ స్థానాన్ని 2100 వరకు నిలుపుకుంటుందని తేల్చారు. భారత్‌కు జనాభా పెరుగుదల పెనుప్రమాదం కావచ్చునని వారు అంటున్నారు. నేటి ప్రపంచ జనాభా స్థిరీకరణ కావడమే ఉత్తమమని, ప్రపంచ జనాభా ఇలాగే పెరుగుతూ పోతే అల్ప, మధ్య ఆదాయ దేశాలు మరింత ప్రమాదంలో పడగలవని, ఇది జరక్కుండా చూడడమే ఏకైక మార్గమని వారు ఆశాభావం వ్యక్తంచేశారు.
- డా. బుర్ర మధుసూదన్‌రెడ్డి