క్రిస్మస్ రోజూ విరుచుకుపడ్డ రష్యా
ఖర్కీవ్, డిసెంబర్ 25: క్రిస్మస్ వేళ ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకుపడింది. ఖర్కీవ్ నగరంపై క్షిపణులతో భారీగా దాడులు చేసింది. ఖర్కీవ్ మేయర్ ఇగోర్ టెరెకోవ్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ‘ఖర్కీవ్‌పై భారీగా క్షిప ణి దాడులు జరుగుతున్నాయి. నిరంతరం పేలుడు శబ్ధాలు వినిపిస్తూనే ఉన్నాయి.
ఇంకా నగరం వైపు బాలిస్టి క్ క్షిపణులు వస్తూనే ఉన్నాయి’ అని తెలిపారు. మరోవైపు తాము ఉక్రెయి న్ నుంచి వచ్చిన 59 డ్రోన్లను కూల్చివేశామని రష్యా రక్షణశాఖ వెల్లడించిం ది. కొన్ని నెలలుగా తూర్పు ఉక్రెయిన్‌లోకి పుతిన్ సేనలు చొచ్చుకొని వెళ్తు న్నాయి. అమెరికా కొత్త అధ్యక్షుడు అధికారం చేపట్టేలోపే సాధ్యమైనన్ని ప్రాంతాలను స్వాధీనం చేసుకోవాలని రష్యా యోచిస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది ఉక్రెయిన్‌కు చెందిన 190 ప్రాంతాలను ఆక్రమించింది.