calender_icon.png 11 April, 2025 | 2:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలు

04-04-2025 01:23:26 AM

గాలి దుమారాలతో విరిగిన చెట్లు ఒరిగిన విద్యుత్ స్తంభాలు 

యాదాద్రి భువనగిరి ఏప్రిల్ 3 ( విజయ క్రాంతి ) :జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలు కురవడంతో రైతన్నలు నెత్తికి చేతులు పెట్టుకొని ఆందోళన చెందుతుండగా, ఒక్కసారి వాతావరణం చల్లబడడంతో ఇళ్లల్లో ఉండే ప్రజలు సేద తీరుతున్నారు. గాలి దుమారాలతో ఒక్కసారిగా ఈదురు గాలులు రావడంతో బొమ్మలు రామారావు యాదగిరిగుట్ట ఆలేరు మండలాలలో చెట్ల కొమ్మలు, విరిగి విద్యుత్ వైర్లు తెగిపోగా స్తంభాలు ఒరిగిపోయాయి.

వర్ష ప్రభావం బొమ్మలరామారం, రాజపేట మండలాలలో వర్ష ప్రభావం ఎక్కువ ఉంది. ఈ నేపథ్యంలో వరి చేలు పొట్ట కొచ్చినవి, కోయడానికి సిద్ధంగా ఉన్న వరి పంట ఈ వర్షా ప్రభావంతో నష్టపోయే ప్రమాదం ఉందని అధికారులు అంటున్నారు.

భువనగిరి, బీబీనగర్, ఉదయం పోచంపల్లి ,చౌటుప్పల్, వలిగొండ మండలంలో కూడిన వర్షం కురుస్తుంది. మొత్తం జిల్లా వ్యాప్తంగా వర్ష ప్రభావం ఉన్న నేపథ్యంలో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రాళ్లతో కూడిన వర్షం కురువక పోవడంతో ఒకింత రైతులు ఊపిరించుకుంటున్నారు.

రాళ్లు తో కూడిన వర్షం పడట్లేదు రైతన్న లు వరి పంటలపై పరిస్థితి  ఏర్పడేది. వరి పంట కోసి మార్కెట్ కు తరలించేంతవరకు రైతన్నలకు కంటిమీద కునుకు లేకుండా ఉండే వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి.