calender_icon.png 22 January, 2025 | 3:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎదురులేని సాత్విక్ జోడీ

31-07-2024 01:20:04 AM

క్వార్టర్స్‌లో భారత డబుల్స్ జంట

పారిస్: ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ శెట్టి జోడీ క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన గ్రూప్ చివరి మ్యాచ్‌లో సాత్విక్ ద్వయం 21 21 ముహమ్మద్ రియాన్ అల్ఫియన్ (ఇండోనేషియా) జంటపై సునాయాస విజయాన్ని నమోదు చేసుకుంది. ఇక సోమవారం జర్మనీతో జరగా ల్సిన మ్యాచ్ రద్దు కావడంతో సాత్విక్ జోడీ అనధికారికంగా క్వార్టర్స్ బెర్తు దక్కించుకుంది. తాజా విజయంతో దానిని పరిపూ ర్ణం చేసింది. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప కాస్ట్రో జోడీ పూర్తిగా నిరాశపరిచింది. గ్రూప్ చివరి మ్యాచ్‌లోనూ అశ్విని జంట ఓటమి పాలై ఒలింపిక్స్ నుంచి రిక్త హస్తాలతో వెనుదిరిగింది.