అస్సాంలోని జోర్హట్‌లో లచిత్ బర్ఫుకాన్ 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఆవిష్కరించారు. విగ్రహానికి ‘శౌర్య విగ్రహం’గా పేరు పెట్టారు. అసమానమైన ధైర్య సాహసాలు కలిగి, ఓటమి చివరన నిలుచుండి, గెలవటానికి ప్రయత్నించి, సఫలమైన లచిత్ అస్సామీలకు నిరంతర ఆదర్శప్రాయుడు, ఆదరణీయుడు. ‘నేషనల్ డిఫెన్స్ అకాడమీ’ ఆయన సైనిక వీర పరాక్రమ ప్రతాపాన్ని గౌరవిస్తూ, ఉన్నత ప్రతిభా పాటవాలు ప్రదర్శించిన ‘గ్రాడ్యుయేటింగ్ క్యాడెట్’కు ‘లచిత్ ట్రోఫీ’ని బహుకరిస్తారు.
నేటి అస్సాం (నాటి ఆహోం రాజ్యం) లో తై అహోం లాన్ఫిమా కుటుంబ మూలాలు కలిగిన లచిత్ బర్ఫుకాన్, తల్లి కుంతిమోరన్, తండ్రి అహొం జనరల్ రాజనీతిజ్ఞుడు, బహుముఖ ప్రజ్ఞాశా లి అయిన మొమై తములి బర్బరువాలకు అస్సాంలోని గోలఘాట్ జిల్లాలో 1622 నవంబర్ 24న జన్మించాడు. 49 సంవత్సరాల వయసులో 1672 ఏప్రిల్ 25న నాగన్ జిల్లాలోని కలియాబోర్ గ్రామంలో అమరుడయ్యాడు.
లచిత్ తండ్రి, అహోం రాజు రాజాప్రతాప సింహ సేనాపతి. లచిత్ తండ్రికూ డా నిబద్ధతతో తోటమాలిగా పనిచేస్తూ ప్రతిభ కనపరచడంతో రాజు ప్రతాపసిం హ బానిసత్వం నుండి విముక్తి కల్పించాడు. బాల్యం నుండి లచిత్ యుద్ధ విద్యలలో, భారతీయ సంప్రదాయ శాస్త్రాలలో నైపుణ్యం సాధించి తన నైపుణ్యం తో అహోం రాజులవద్ద వివిధ విభాగాలలో పనిచేశాడు. ఆయన ప్రతిభను, సమర్థతను, సూక్ష్మజ్ఞానాన్ని, లోతైన అధ్యయనాన్ని గుర్తించిన అహోం రాజు చక్రధ్వజ సింహ, లచిత్‌ను ‘బర్ఫుకాన్’ (అహోం రాజ్యంలోని కార్యనిర్వాహక, న్యాయాధికారాలున్న అయిదుగురు ప్రధాన మంత్రి మండలిలో ఒక మంత్రి) గా నియమించాడు. అస్సామీల చారిత్రక గర్వ స్థితిస్థాపక చిహ్నంగా భావిస్తూ, ఆయన పుట్టినరోజును ‘లచిత్ దివస్’గా జరుపుకుంటారు.
1660లో ఔరంగజేబుతో బెంగాల్ సుబేదార్‌గా నియమితుడైన మీర్ జూమ్లా/మీర్ మహమ్మద్ అర్దిస్తాని (ఇరాన్ సఫావీడ్ రాష్ట్ర, ఇస్పాహన్ నగరా నికి చెందినవాడు, గతంలో గోల్కొండ నవాబులవద్ద కూడా పనిచేశాడు)తో అవమానకరమైన ఓటమి చవిచూసిన అహోం రాజు జయధ్వజ సింహ నిరాశ తో మరణశయ్యపై ఉండి వారసుడు, బంధువు అయిన చక్రధ్వజ సింఘాతో దేశం వక్షస్థలం నుండి అవమానకరమైన ఈటెను తొలగించమని ప్రాధేయపడి ప్రాణం వదిలాడు. ఈ ఓటమితో చెల్లాచెదరైన అస్సాం ప్రజలను కూడదీశారు. అదే సమయంలో లచిత్ బర్ఫుకాన్ ఆధ్వర్యంలో సైన్యం పునర్నిర్మాణంతోపాటు కోట నిర్మాణమూ జరిగింది. జయంతి యా, కచారి రాజ్యాలతో సయోధ్య పొత్తులుకూడా ఏర్పరచుకున్నారు. ఇదే సమ యంలో మొగలులతో ఏర్పరచుకున్న ఒప్పందాలు తిరస్కరణకు గురయ్యాయి.
అహోం రాజ్యాన్ని ఆక్రమించడానికి ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన మహమ్మద్ ఘోరి 1173 నుంచి ప్రయత్నించాడు. కానీ, వీరోచిత పోరాట నైపుణ్యం, ధైర్య సాహసాలు కలిగిన అహోం రాజులు వారిని నిలువరిస్తూనే ఉండేవారు. మరాఠా రాజ్యాన్ని మినహాయించి భారతదేశాన్ని ఆక్రమించిన మొగలులు ఈశాన్య భారతాన్ని ఆక్రమించడానికి యత్నించారు. ఆ సమయంలో అహోం రాజ్యంలో ఏర్పడ్డ అంతర్గత సమస్యలవల్ల గౌహతిని మొగలులు చేజిక్కించుకున్నారు. మొత్తం అహోం రాజ్యాన్ని ఆక్రమించాలనే మొగలుల సంకల్పాన్ని అమలు చేయడానికి ఔరంగజేబ్ 1671లో భారీ సైన్యంతో ప్రముఖ అంబర్ రాజ్యపాలకుడైన మీర్జా రాజా జైసింగ్ కుమారుడు కచ్వాహ రాజపుత్ర రాజు రాజారామ్ సింగ్ నేతృత్వం లో బ్రహ్మపుత్ర నదీతీరం సరైఘాట్‌కు పంపాడు. అక్కడ జరిగిన యుద్ధమే లచిత్ బర్ఫుకాన్‌తో మొగలులను నిలువరించి అహోం ఆక్రమణకు గురి కాకుం డా చరిత్రలో ప్రముఖ స్థానాన్ని నిలుపుకోగలింది. ఇదే ‘సరైఘాట్ యుద్ధం’గా ప్రసిద్ధి చెందింది.
సరైఘాట్ యుద్ధంలో గాయపడి తీవ్ర అనారోగ్యం పాలైనాగాని, వైద్యులు వారించినా గుండెలనిండా జాతీయతను నింపుకొని, నిబద్ధతతో యుద్ధంలో ముం దుకు సాగాడాయన. ఫలితంగా అహోం సైన్యం లచిత్‌నుంచి స్ఫూర్తి పొంది రణ నినాదం చేసింది. నేటికీ అస్సాం ప్రజలు ఆ వీరుని శౌర్యాన్ని స్మరించుకుంటూనే ఉంటారు.
డా.కావలి చెన్నయ్య ముదిరాజ్