- ఏటేటా పెరుగుతున్న గ్రామ సింహాలు
- కుక్క కాటుకు బలవుతున్న సామాన్యులు
- శిథిలావస్థకు చేరుతున్న కుక్కల ఆపరేషన్ థియేటర్
నాగర్‌కర్నూల్, జనవరి 12 (విజయ క్రాంతి): గ్రామాల్లో వీధికుక్కలు సైరవిహారం చేస్తున్నాయి. చిన్నా పెద్దా అని తేడా లేకుం డా పిక్కలను పీక్కు తింటున్నాయి. దీంతో కొందరు వికలాంగులుగా మారుతుంటే మరి కొందరు మానసికంగా భయ భ్రాంతు లకులోనై ఒంటిరిగా బయటికి రావాలంటేనే జంకుతున్న పరిస్థితి నెలకొంది. పదాచా రులు, చిన్నారులు, వద్ధులపై ఉన్నట్టుండి దాడిచేసి కాటు వేస్తున్నాయి.
జిల్లా వ్యాప్తం గా ఇలాంటి ఘటనలు రోజు రోజుకూ రెట్టిం పవుతున్నా అధికారుల్లో చలనం రావడం లేదని మండిపడుతున్నారు. గత మూడేళ్ల లోనే సుమారు 5వేలకు పైగా కేసులు నమోదు కావడంతో ప్రజల్లో తీవ్ర అసంత్రు ప్తి నెలకొంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ వాటికి నివారణ మందులు అంటీ రెబిస్ వ్యాది టికాలు సక్రమంగా అందుబాటులో లేవని బాదితులు మండిపడుతున్నారు.
నాగర్ కర్నూల్ జిల్లాలోని మండల కేంద్రా లు, గ్రామీణ ప్రాంతాలతో పాటు, కల్వకుర్తి, అచ్చంపేట, నాగర్ కర్నూల్, కొల్లాపూర్ వంటి పట్టణ ప్రాంతాల్లో కుక్కల సంఖ్య గతేడాది కంటే భారీగా పెరిగాయని అధికా రిక లెక్కల్లో తెలుస్తోంది. పట్టణంలోని చేపల మార్కెట్, మటన్, చికెన్ సెంటర్లలో ఇష్టారీ తిగా మాంసపు వ్యర్ధాలు పారబోయడంతో వాటిని తిన్న కుక్కలు అటుగా వెల్లె వారిపై కూడా దాడి చేసిన ఘటనలు ఉన్నాయి.
ఒకే ప్రాంతంలో ఎక్కువ సంఖ్యలో కుక్కలు సంచరించడం వల్ల వాటి మానసిక స్థితిని కోల్పోయి మనుషులపై దాడిచేసే పరిస్థితి ఏర్పడుతుండని నిపునులు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 12,706 వీధికుక్కలు, 1,435 పెంపుడు కుక్కలు ఉన్నట్లు అదికారిక లెక్కలు చెబుతున్నా వీది కుక్కల సంఖ్య ఈ ఏడాదిలోనే అత్యదికంగా పెరిగాయని అందుకే కుక్కకాటు కేసులు కూడా గణనీ యంగా పెరిగాయని తెలుస్తోంది.
క్రమంగా కుక్కల సంతతిని నిలువరించాల్సిన సబంది త మున్సిపల్, గ్రామపంచాయితీ అదికారు లు ప్రతి ఏటా వాటి పేరుతో నిదులు స్వాహా చేసుకోవడమే కాని వాటిని నిలువరించేం దుకు కచ్చితమైన నిర్ణయాలు మాత్రం తీసుకోవడం లేదని ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది క్రితం జిల్లాలోని గగ్గలపల్లి గ్రామ శివారులో ఏర్పాటు చేసిన కుక్కల ఆపరేషన్ తియేటర్ ప్రారంబానికి నోచుకోక ప్రస్తుతం శిథిలావస్థకు చేరినట్లు స్థానికులు మండి పడుతున్నారు.
కుక్కల సంసతిని క్రమంగా నిలువరించేందుకు సుమారు 5 కుక్కలకు ట్యూబెక్టమీ, వేసక్టమీ చేయడానికి వీలుగా ఈ ఆపరేషన్ తియో టర్ ఏర్పాటైంది. కానీ వాటికి తగిన ఆపరే షన్ కిట్లు, మెడిసిన్, పశువైద్యా దికారులు, డాగ్ క్యాచర్స్ ఏర్పాటుకు గల కాంట్రాక్ట్ అప్పగించడంలో అధికారులు తలమునకల వుతున్నారు. దీంతో ఆపరేషన్ తియోటర్ కా స్తా షెడ్డులా మారి శిథిలావస్థకు చేరుతోంది.
వీధికుక్కల సంతతి రెట్టింపు..!
కుక్కల జీవన ప్రమానంలో ఏడాదికి రెం డు సార్లు గర్భందాల్చి ఒక్కో కాన్పులో సు మారు ఐదు నుండి 12 కుక్కపిల్లలకు జన్మని స్తాయని వైద్యులు చెబుతున్నారు. కుక్క కాటుతో ప్రజలు గ్రాయాలపాలవుతున్నార ని గుర్తించి గత ప్రభుత్వం ఒక్కో కుక్కకు 5రోజుల పాటు చికిత్స అందించేలా జిల్లా కేంద్రంలోని గగ్గలపల్లి గ్రామ శివారులో 5 కుక్కలకు ఆపరేషన్ తియోటర్ నిర్మాణం చేపట్టారు. కానీ అందుకు కాంట్రాక్ట్ అప్పగించడంలో మాత్రం అదికారులు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. ఫలితంగా ఏడాది లోనే కుక్కల సంతతి పెరిగి కుక్కకాటు కేసుల పెంపునకు కారణమవుతున్నారని సామా న్యులు ఆరోపిస్తున్నారు.