calender_icon.png 23 December, 2024 | 2:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విడువని వాన.. నగరవాసుల హైరానా!

07-09-2024 12:06:23 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): నగరంలో శుక్రవారం సాయంత్రం మరోసారి వర్షం దంచికొట్టింది. ఉదయం కాస్త తెరిపిచ్చినప్పటికీ, సాయంత్రం వరణుడు ఒక్కసారిగా ప్రతాపం చూపించాడు. అమీర్‌పేట్, బంజారాహిల్స్, మియాపూర్, గచ్చిబౌలి, ఖైరతాబాద్, నాంపల్లి, నారాయణగూడ తదితర ప్రాంతాల్లో వర్ష తీవ్రత ఎక్కువగా ఉంది.

రహదారులు జలమయం కావడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు.  హైటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాల్లో గంటల కొద్దీ ట్రాఫిక్ జాం ఏర్పడి వందలాది వాహనాలు రోడ్లపైనే నిలిచిపోయాయి. శని, ఆదివారాల్లోనూ నగరంలో మోస్తరు నుంచి భారీ వర్షం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. 

సింగూర్ ప్రాజెక్టుకు జలకళ

సంగారెడ్డి, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): ఎగువను కురుస్తున్న వర్షాలతో సింగూర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. కర్ణాటక, మహారాష్ట్రతో పాటు జహీరాబాద్, నారాయణఖేడ్ ప్రాంతంలో భారీ వర్షాలు కురువడంతో పాజెక్టులోకి భారీగా వరదనీరు చేరుతోంది. మంజీరా నది పై ఉన్న సింగూర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 29.917 టీఎంసీలు కాగా శుక్రవారం సాయంత్రం వరకు ప్రాజెక్టులో 28.939 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అలాగే సంగారెడ్డి పట్టణ సమీపంలో ఉన్న కల్పగూర్ గ్రామంలో ఉన్న మంజీరా నది పూర్తి స్థాయిలో నిండిపోయింది. సింగూర్ ప్రాజెక్టుకును చూసేందుకు  భారీ సంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నారు.