02-03-2025 12:09:43 AM
హైదరాబాద్, మార్చి 1 (విజయక్రాంతి): మున్నూరు కాపు సామాజిక వర్గానికి రాజకీయంగా తగిన ప్రాధాన్యం లభించడం లేదని ఆ సామాజికవర్గానికి చెందిన అన్ని పార్టీల నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ నివాసంలో శనివారం వివిధ పార్టీలకు చెందిన మున్నూరుకాపు నేతలు భేటీ అయ్యారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలకు చెందిన కీలక నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. కులగణన సరిగ్గా నిర్వహించలేదని, తమ కుల జనాభా సంఖ్యను తగ్గించారనే అభిప్రాయాన్ని నేతలు వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీల్లో తమకు దక్కిన ప్రాధాన్యత కాంగ్రెస్‌లో కరువైందని నేతలు అభిప్రాయ పడిన ట్టు సమాచారం. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ మున్నూరు కాపు నేతలకు కీలక పదవులు ఇచ్చిందని.. ప్రస్తుత మంత్రివర్గంలో ము న్నూరు కాపు సామాజికవర్గానికి ప్రాతినిధ్యం లేకపోవడంపై నేతలు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్ కూడా మున్నూరు కాపుల అవసరాన్ని గుర్తించి.. రెండుసార్లు మంత్రివర్గంలో చోటు కల్పించారన్నారు.
బీజేపీ కూడా మున్నూరు కాపు నేతలకు ప్రాధా న్యం ఇస్తోందని.. ఈ రెండు పార్టీల నుంచి దక్కినన్ని ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు కాంగ్రెస్ ఇవ్వలేదని నేతలంతా అభిప్రాయపడినట్టు తెలిసింది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సస్పెం డ్ అంశంపై కూడా చర్చించారని.. మల్లన్న ఎత్తుకున్న నినాదం సరైందే కానీ, పార్టీ లైన్‌కు కట్టుబడి ఉండకపోవడం సరికాదని నేతలు అన్నట్టుగా తెలుస్తోంది. త్వరలో కే కేశవరావు చైర్మన్‌గా మున్నూరు కాపుల భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
భేటీకి కాంగ్రెస్ పార్టీకి చెందిన కే కేశవరావు, వీ హనుమంత్ రావు, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, బొంతు రా మ్మోహన్, ఆకుల లలిత, గాలి అనిల్, బొ మ్మ శ్రీరామ్ చక్రవర్తి, బీఆర్‌ఎస్ పార్టీ నుంచి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే గం గుల కమలాకర్, మాజీ ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్, వీ ప్రకాశ్ సహా బీజేపీ నుంచి మీసా ల చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.