రాష్ర్ట ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు
మంథని, ఫిబ్రవరి 2 విజయక్రాంతి) దేశంలో ఎన్నికలు జరిగే రాష్ట్రాలకే బడ్జెట్ కేటాయింపులు చేశారని రాష్ర్ట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్య రాష్ట్రాలకే నిధులు ఇచ్చారని, కేంద్ర జీడీపీలో రాష్ర్టం వాటా 5 శాతం ఉన్నా నిధులు మాత్రం కేటాయించలేదని శ్రీధర్ బాబు అవేదన వ్యక్తం చేశారు.
పన్నుల రూపంలో రూ.26 వేలకోట్లు కేంద్రానికి వెళ్లాయని, రాజకీయ కారణాలతోనే తెలంగాణను చిన్నచూపు చూశారని, 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచినా తెలంగాణ ప్రజలకు మోదీ సర్కార్ ద్రోహం చేసిందన్నారు. మా విజ్ఞప్తులను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.