calender_icon.png 29 April, 2025 | 2:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీసు వైద్య సేవలకు అపూర్వ స్పందన

28-04-2025 01:08:32 AM

బెల్లంపల్లి అర్బన్, ఏప్రిల్ 27: మంచిర్యా ల జిల్లా తాండూరు మండలం మాదారం పోలీసుల ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన మెగా వైద్య శిబిరానికి అపూర్వ స్పందన వచ్చింది. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ తో కలిసి మెగా వైద్య శిబిరంలో పాల్గొని మాట్లాడారు. శాం తిభద్ర భద్రతల పరిరక్షణతో పాటు ప్రజల ఆరోగ్యం పరీక్షలకోసం పోలీసులు వైద్య సేవ లు అందించడం ముదావవహమన్నారు.

గిరిజన పేద ప్రజలకు ఉచితంగా వైద్య సేవ లు అందించడం పట్ల ఆయన అభినందించారు. ఏసీపీ రవికుమార్ మాట్లాడుతూ గిరిజనులకు అత్యున్నతమైన వైద్య సేవలు అందించిన అందించిన ఘనత మాదారం పోలీసులు దక్కుతుందన్నారు. ఈ సందర్భం గా వారిని ప్రశంసించారు. మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించి గిరిజనులకు సంక్షేమానికి పాటుపడాలన్నారు.

ఈ వైద్య శిబి రంతో తాండూర్ మండలం మాదారం పోలీస్‌స్టేషన్ పరిధిలో గల నర్సపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని అసలమాడా, బీర్స యిగూడ, గంగుపటేల్ గూడా, బెజ్జల, భోగ డగూడా, లిoగుపటెల్ గూడ, గంపలపల్లి, గంటలగూడా, లాస్పటలగూడ, దొడ్డిగూడా, నర్సపూర్, అబ్భాపూర్, రాంగూడ, కడెంబెర్గుడా,రోడగూడ, పళ్లెవగూగూడ, ఎల్లయ్యగ డలలోని గూడెల ప్రజలు మెడిలైఫ్ హాస్పిటల్ సహకారం తో వైద్య సేవలు పొందారు. 

500కు పైగా గిరిజనులకు ఉచిత వైద్య  శిబిరంలో పాల్గొని వైద్య పరీక్షలు చేయించు కున్నారు. ఉచితంగా పరీక్షలు చేసిమందులు ఇచ్చారు. ఈ కార్యక్రమoలో బెల్లంపల్లి ఏసిపి రవి కుమార్,తాండూర్ సీఐ కుమార స్వామి, మాదారం ఎస్సై సౌజన్య, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.