మంథని మున్సిపల్ కౌన్సిల్ చివరి సమావేశంలో చైర్పర్సన్ పెండ్రు రమాదేవి
మంథని, జనవరి 20 (విజయ క్రాంతి): మంత్రి శ్రీధర్‌బాబు అండదండలతో మం థనిలో ఎన్నడూ లేని అభివద్ధి జరుగుతుం దని మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రు రమాదేవి తెలిపారు. మంథని మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో ఈ సమావేశంలో 11, కౌన్సిలర్లతో సమావేశం నిర్వహించారు.
13 వ వార్డు సం బంధించి ఎమ్మెన్నార్ నగర్ (ముస్కుల నా రాయణరెడ్డి నగర్), పోచమ్మ డబుల్ బెడ్ రూమ్ ఏరియాకి శివ నాగపూరి కాలనీ మ రియు 1వ వార్డు పవర్ హౌస్ కాలని ని శ్రీ పాద కాలనీగా కొనసాగించుటకు, 1వ వార్డు శ్రీపాద కాలని 10 గుంటల ప్రభుత్వ స్థలం లో 5 గుంటలు బీసీ కమిటీ హాల్ మరియు మరొక 5 గుంటల లో తాత్కాలిక గోశాల ఏర్పాటు చేయుటకు మరియు ఇతరత అంశాల మీద తీర్మానం చేశారు.
ఈ సమావే శంలో చైర్ పర్సన్ మరియు కౌన్సిల్ సభ్యు లు మాట్లాడుతూ తెలంగాణ ఐటీ శాఖ మం త్రి శ్రీధర్ బాబు అండ దండలతో మంథని ని ఎన్నడూ లేని విధంగా అభివద్ధి బాటలో నడిపిస్తున్నారని తెలిపారు. మంథని మున్సి పాలిటీ అభివద్ధి కార్యక్రమములో భాగంగా తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ మరియు ఇన్ఫ్రా స్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ అభివద్ధి పనులద్వారా మంథని మున్సిపాలిటీ పరిధి లోని ప్రతి వార్డు కు రోడ్లు మరియు డ్రైనేజీ ఒక కోటి రూపాయలతో 13 వార్డులకు గాను రూ. 13.95 కోట్ల రూపాయలు మం జూరి చేయించి ఇప్పటి వరకు 85% శాతం పనులను పూర్తి చేశామన్నారు.
మునిసిపల్ ఆఫీస్ నిర్మాణం, డంపింగ్ యార్డ్ యందు సెగ్రి గేషన్ షెడ్, డి.ఆర్.సి.సి. కంపోస్ట్ షెడ్, ఆఫీస్ రూమ్, సెక్యూరిటీ రూ మ్, టాయి లెట్స్, వేయింగ్ బ్రిడ్జ్ మరియు ఆర్చీల నిర్మాణం కొరకు : రూ. 9.20 కోట్లు
మంథని పట్టణములో సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేయుటకు కొరకు: రూ. 6.71 కోట్లు వెజ్ మరియు నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణం మరియు వివిధ వార్డులలో సైడ్ డ్రైనులు మరియు సి.సి. రోడ్ల నిర్మాణము కొరకు రూ. 8.14 కోట్లు మంథని మున్సిపా లిటీ లో మంత్రి శ్రీధర్ బాబు సహకా రముతో మొత్తం (టియుఎఫ్ ఐడిసి) నిధుల ద్వారా రూ. 38.00 కోట్లతో రూపాయలు మంజూరు చేశారని, నూతన హంగులతో ఆర్టీసీ బస్టాండ్ విస్తరణ కొరకు రూ. 95 లక్షలు మంజూరు చేయించారని, మంథని గోదావరి నది వంతెన నిర్మాణం కొరకు 135 కోట్ల రూపాయలు మంజూరి చేయిం చిన మంత్రి దుద్ధిల్ల శ్రీధర్ బాబు కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ సమావేశంలో వైస్ చైర్మన్ శ్రీపతి బానయ్య, వార్డు కౌన్సి లర్లు గుండా విజయలక్ష్మి, కుర్ర లింగయ్య, నక్క నాగేంద్ర, గర్రెపల్లి సత్యనారాయణ, కొ ట్టే పద్మ, చొప్పకట్ల హనుమంతరావు, వీకే. రవి, వేములక్ష్మి పాల్గొన్నారు.