23-04-2025 12:45:49 AM
విద్యార్థులను అభినందించిన యాజమాన్యం, అధ్యాపక బృందం
హబూబ్ నగర్ ఏప్రిల్ 22 (విజయక్రాంతి) : ఇంటర్ ఫలితాలలో తమకు మరెవరు సాటిలైరనే ర్యాంకులను సాధించారు జిల్లా కేంద్రంలోని ప్రతిభ కళాశాల విద్యార్థులు. ఎంపీసీ మొదటి సంవత్సరంలో ఇ వైష్ణవి 468, యం ఉపేంద్ర 468, యం విజయలక్ష్మి, గణేష్, అక్షిత రెడ్డి, సాయి చరణ్ లకు 467, డి కీర్తి, అయిషాతహరిన్, డి హర్షిత, కే వర్షిని, హురియ రషీద్, ఆర్ విశాల్, శోభారాణి, యం నవీన్ కుమార్, నితిన్, త్రిష విద్యార్థులు 466 మార్కులను సాధించారు.
బైపిసి విభాగంలో నెక్కొండ హాసిని, కే వైష్ణవి 436, సుప్రజ 435 మార్కులను సాధించారు. ఎంపీసీ రెండవ సంవత్సరం లో బి అక్షిత 994, ఎల్ అమోఘ 993, ఎం భవిత, శివ జ్యోతిక, తమీమా ఫాతిమా, ఎన్ వర్షిత్ రెడ్డి 992 మార్కులను తమ సొంతం చేసుకున్నారు. బైపీసీ రెండవ సంవత్సరంలో ఏ అక్షిత 994, అజీమ్ కౌసర్ 991, బైన్ బీన్ మహమ్మద్, ముదావత్ భూమిక 990 మార్కులను సొంతం చేసుకున్నారు.
వీరితోపాటు ఎంపీసీ, బైపీసీ మొదటి విభాగంలో 514 మంది విద్యార్థులు 400 పైగా మార్కులు సాధించగా, రెండో విభాగంలో 4 62 మంది విద్యార్థులు 900 పైగా మార్కులు సాధించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను, బోధించిన అధ్యాపకులను కళాశాల గౌరవ అధ్యక్షులు కె మంజుల దేవి, వి లక్ష్మారెడ్డి, కె విష్ణువర్ధన్ రెడ్డి, కే రఘు వర్ధన్ రెడ్డి, కే జనార్దన్ రెడ్డి, జి వెంకటేశ్వర్ రెడ్డి లు ప్రత్యేకంగా అభినందించారు.