calender_icon.png 25 October, 2024 | 8:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందని ఓవర్సీస్ స్కాలర్ షిప్!

12-08-2024 01:30:42 AM

  1. ‘విదేశీ విద్య’ అమలులో సర్కారు జాప్యం
  2. మార్చిలోనే పూర్తి కావాల్సి ఉన్నా పట్టింపేదీ?  
  3. సీట్లు పెంచేందుకేనంటూ కాలయాపన
  4. బీసీ సంక్షేమ శాఖ నిర్లక్ష్యం బహిర్గతం

హైదరాబాద్, ఆగస్టు 11 (విజయక్రాంతి): వెనుకబడిన తరగతి, ఆర్థికంగా వెనుకబడిన వర్గానికి చెందిన విద్యార్థుల చదువులకు ఆర్థికంగా భరోసానిచ్చే లక్ష్యంతో ప్రభుత్వం మహాత్మా జ్యోతిబా పూలే ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా అర్హులైన విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత చదువుకు కావాల్సిన ఆర్థిక చేయూతను అందిస్తుంది. అయితే, ఈ ఏడాది మాత్రం ప్రభుత్వ లక్ష్యం నెరవేరలేదు. విదేశాల్లో చదువాలనే కలతో ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకానికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు నిరాశే మిగిలింది. ఈ పథకం కింద అర్హులైన విద్యార్థులను ఎంపిక పూర్తయినప్పటికీ నిధుల విడుదలకు మాత్రం బీసీ సంక్షేమ శాఖ జాప్యం చేస్తున్నది. తద్వారా లబ్ధి పొందాల్సిన విద్యార్థుల ఇబ్బందులకు కారణమవుతున్నది. 

మార్చిలోనే పూర్తవ్వాలి 

ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకం కింద ఈ ఏడాదికి సంబంధించిన ఎంపిక ప్రక్రియ 2024 మార్చిలోనే పూర్తి చేయాల్సి ఉంది. 2024 జనవరి 8 న నోటిఫికేషన్ విడుదల చేసి విద్యార్థులకు సంబంధించిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ కూడా నిర్వహించింది. ఫిబ్రవరి/మార్చి సీజన్‌కు సంబంధించి అర్హుల ఎంపికను మార్చి వరకే పూర్తి చేయాల్సి ఉంది. కానీ, పార్లమెంట్ ఎన్నికల కారణంగా అమలు ప్రక్రియలో జాప్యం జరిగిందని బీసీ సంక్షేమ శాఖ చెప్తూ వస్తుంది. ఎన్నికలు పూర్తయి ౩ నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఎలాంటి స్పందనా లేదు. 

రూ.5 లక్షల్లోపే ఆదాయం..

ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునే విద్యార్థులకు కొన్ని అర్హతలను నిర్ణయించారు. కుటుంబ ఆదాయం సంవత్సరానికి రూ.5 లక్షల కంటే తక్కువ ఉన్న విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్ ప్రయోజనాన్ని పొందడానికి అర్హులుగా పేర్కొంది. దీంతోపాటు ఒక కుటుంబం నుంచి ఒకరికే లబ్ధి పొందేందుకు అవకాశం ఉంటుంది. ఎంపికైన విద్యార్థులకు ఉన్నత విద్య కోసం రూ. 20 లక్షలను ప్రభుత్వం అందిస్తుంది. ఈ మొత్తాన్ని 2 వాయిదాల్లో చెల్లిస్తుంది. యూఎస్‌ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్, జర్మనీ, న్యూజి లాండ్, జపాన్, ఫ్రాన్స్, దక్షిణ కొరియాలో విద్య కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ స్కాలర్ షిప్ కింద ఎంపిక కావాలనుకుంటే TOEFL / IELTS / GRE / GMATలో కనీస మార్కులను స్కోర్ చేసి ఉండా లి. జూలై 1 నాటికి పథకం కింద అనుమతించిన గరిష్ఠ వయస్సు 35 ఏళ్ల కంటే ఎక్కువగా ఉండకూడదని ప్రభుత్వం నిబంధన పెట్టింది. దీంతోపాటు మొత్తం సీట్లల్లో ఆయా వర్గాల వారీగా లబ్ధిదారుల శాతాన్ని నిర్ణయించింది. బీసీ క్యాటగిరికి చెందిన అభ్యర్థులకు 29 శాతం, బీసీ క్యాటగిరికి చెందిన అభ్యర్థులకు 42 శాతం, బీసీన క్యాటగిరికి చెందిన అభ్యర్థులకు 29 శాతంగా సీట్లను కేటాయించింది. ఇందులో మహిళా అభ్యర్థులకు 33 శాతం, దివ్యాంగ విద్యార్థులకు 3 శాతం సీట్లను కేటాయిస్తున్నది. 

సీట్ల పెంపు పేరిట కాలయాపన 

గతంలో మహాత్మా జ్యోతిబా పూలే ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకం కింద 300 మంది విద్యార్థుల కు అవకాశం ఉండేది. అయితే, రాష్ట్రంలో ఈ పథకాన్ని మరింత ఎక్కువ మందికి వర్తింపజేసి విదే శాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు అన్ని సదుపాయాలను కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అధికారులు చెప్తున్నారు. అర్హుల సంఖ్యను 300 నుంచి 3 వేలకు పెంచాలని నిర్ణయించారు.

ఈ మేరకు ప్రభుత్వానికి బీసీ సం క్షేమ శాఖ నుంచి ప్రతిపాదనలు కూడా అందాయి. కానీ, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేదు. ప్రస్తుతం ఎంపికైన 300 మందికి పెంచిన విద్యార్థులతోపాటే పథకాన్ని వర్తింపజేయాలని చూస్తోం ది. దీంతో ఈ స్కాలర్‌షిప్‌నకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ పథకం ద్వారా నిరుడు మొదటి విడతలో స్కాలర్‌షిప్‌ను అందుకున్న వారికి రెండో విడతకు సంబంధించిన పేమెంట్ ఇంకా విడుదల కాలేదు.