Gaza:గాజాలో ఇజ్రాయిల్ దాడులు ఏమాత్రం ఆమోద యోగ్యం కావని ఐరాస ఆందోళన వ్యకతం చేసింది. ఇజ్రాయిల్ హమాస్ యుద్ధం అటు గాజా ప్రజలు, ఇటు వారి సహాయార్థం సేవలందిస్తున్న సిబ్బంది ప్రాణాలమీదకు తెస్తుంది. బెంజమిన్ నెతన్యాహు సేనలు పాఠశాల, కొన్ని ఇళ్లపై జరిపిన వైమానిక దాడిలో 34 మంది ప్రాణాలు కోల్పోయారని స్థానిక ఆసుపత్రి తెలిపింది. వారిలో తమ సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. ఈ మేరకు యూఎన్ చీఫ్ ఆంటోనియో గుటెరస్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు." గాజాలో జరుగుతున్నది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. అంతర్జాతీయ మానవతా చట్టం ఉల్లంఘనలను వెంటనే ఆపాలి. యూఎన్ పాలస్తీనియన్ రిఫ్యూజీ ఏజెన్సీకి చెందిన ఆరుగురు సభ్యులు ప్రాణాలు కోల్పోయారు" అని ఆందోళన వ్యక్తం చేశారు.