13-02-2025 12:55:06 AM
ఛత్తీస్‌గఢ్ హైకోర్టు సంచలన తీర్పు
రాయ్‌పూర్, ఫిబ్రవరి 12: భార్య అనుమతి లేకుండా అమెతో అసహజ శృంగారం జరపడాన్ని నేరంగా పరిగణించలేమని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు పేర్కొంది. భార్య వయసు 15 ఏళ్లు దాటి ఉన్నప్పుడు భర్త చేసే ఎలాంటి లై ంగిక చర్య అయినా అత్యాచారం కిందకు రాదంది. బస్తర్ జిల్లాకు చెందిన ఓ మహిళ తన భర్త అలైంగిక శృంగారం చేశాడని ఆరోపిస్తూ అతడిపై అత్యాచార కేసు పెట్టింది. దీంతో పో లీసులు 2017లో అతడిని అరెస్ట్ చేశారు.
జగదల్‌పుర్‌లోని అదనపు సెషన్స్ న్యాయమూర్తి ఎదుట సదరు మహిళ మరణ వాం గ్మూలాన్ని ఇచ్చింది. దీంతో దిగువ కోర్టు అతడికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించిం ది. తీర్పును సదరు వ్యక్తి హైకోర్టులో సవాల్ చేశాడు. ఈ కేసును జస్టిస్ నరేంద్రకుమార్ వ్యాస్ ధర్మాసనం విచారించి.. నిర్దోషిగా తీ ర్పు చెప్పింది. నిందితుడిని వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది.